Biggboss 9: మొదటి వారంలోనే రచ్చ రచ్చ, నామినేషన్లతో హీటెక్కిన హౌస్
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్‌గా మొదలైంది. ఆదివారం హోస్ట్ నాగార్జున సమక్షంలో 15 మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్ ప్రారంభమైంది. అయితే, రెండో రోజు ఎపిసోడ్‌లోనే ఊహించని సంఘటనలు జరిగాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, భావోద్వేగాలు, నామినేషన్లతో ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది.
Biggboss 9: మొదటి వారంలోనే రచ్చ రచ్చ, నామినేషన్లతో హీటెక్కిన హౌస్
Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్‌గా మొదలైంది. ఆదివారం హోస్ట్ నాగార్జున సమక్షంలో 15 మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్ ప్రారంభమైంది. అయితే, రెండో రోజు ఎపిసోడ్‌లోనే ఊహించని సంఘటనలు జరిగాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, భావోద్వేగాలు, నామినేషన్లతో ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది.
సంజనపై ఆరోపణలు, గొడవలు
బిగ్ బాస్ హౌస్ ఓనర్లుగా ఉన్న కంటెస్టెంట్లు, హౌస్ టెనెంట్లను నామినేట్ చేయమని కోరగా, వారంతా కలిసి సంజన గల్రానిని ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. ఆమె వెనుక గోతులు తీస్తున్నారని, అబద్ధాలు చెబుతున్నారని, ఆమె వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
దీనిపై ప్రియతో గొడవపడ్డ సంజన.. "ఇప్పటి నుంచి నా అసలు ఆట చూపిస్తాను. రేపటి నుంచి నా నిజమైన ఆట మొదలవుతుంది" అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఆ తర్వాత, బాత్‌రూమ్‌లో షాంపూ విషయంలో ఫ్లోరా సైనీతో కూడా ఆమెకు గొడవ జరిగింది. దాంతో ఫ్లోరా బాధపడి ఏడ్చింది. రీతు చౌదరి, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఈ చిన్న గొడవ పెద్ద వివాదానికి దారితీసింది.
ఏడుపుల వెనుక కారణం అదేనా?
ఓనర్లు, టెనెంట్లుగా విడిపోయిన కంటెస్టెంట్లు తమ అతిథుల కోసం వంట చేయాల్సి ఉంది. అయితే, ఓనర్లు కొన్ని షరతులు పెట్టడంతో తనూజ బాధపడి ఏడ్చింది. సంజన, ఫ్లోరా, తనూజ వంటి వారు ఏడ్వడం చూసి, దమ్ము శ్రీజ, "కెమెరాలు తమపై ఫోకస్ చేస్తాయని వీళ్ళు ఇలా ఏడుస్తున్నారని" వ్యాఖ్యానించింది. దీనిపై సంజన బాధపడి, "ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు.. ఇదంతా నాకు కొత్త" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
టాస్క్‌లో రీతుకు గాయాలు, నామినేషన్ల వేడి
మరోవైపు, బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన టాస్క్‌లో రీతు చౌదరి తలకు గాయమైంది. రీతూ, డీమాన్ పవన్ మధ్య జరిగిన గొడవ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. మొదటి వారంలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఓనర్లకు మినహాయింపు ఉండగా, టెనెంట్లను మాత్రమే నామినేట్ చేయాలి. ఈ ప్రక్రియలో తనూజ, కళ్యాణ్, సంజనను నామినేట్ చేశారు. సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ రాము రాథోడ్, మాస్క్ మ్యాన్ హరీష్, అతను హౌసులో కాస్త స్లోగా ఉన్నాడని, ఎవరితో సరిగా కలవడం లేదని ఆరోపించారు. ఇంకా, సుమన్ శెట్టిలో యాక్టీవ్ నెస్ లేదని, ఆటల్లో కూడా చురుగ్గా లేడని, బద్ధకంగా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సంజన, సుమన్ శెట్టి, భరణి, ఇమ్మాన్యుయేల్ నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియ బుధవారం ఎపిసోడ్‌లో పూర్తవుతుంది.