Chiru and Mohan Babu: చిరంజీవి మరియు మోహన్ బాబు ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్
Chiru and Mohan Babu: సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు మోహన్ బాబుల మధ్య మంచి స్నేహమే ఉంది.
Chiru and Mohan Babu: చిరంజీవి మరియు మోహన్ బాబు ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్
Chiru and Mohan Babu: సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు మోహన్ బాబుల మధ్య మంచి స్నేహమే ఉంది. కానీ గత కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయని, వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని కొంత మంది పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే వీటికి కారణం లేకపోలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి మరియు మోహన్ బాబుల మధ్య గొడవకు కారణం మా ఎలక్షన్స్ అని కొందరు చెబుతున్నారు. మా ఎలక్షన్ల వల్ల చిరు మరియు మోహన్ బాబుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
అసలు కథలోకి వెళితే త్వరలోనే మా ఎలక్షన్స్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తో పాటు మరికొందరు ఎలక్షన్స్ లో పాల్గొనబోతున్నారు. అయితే చిరంజీవి ప్రకాష్ రాజ్ కి తన మద్దతు ఇస్తుండగా మోహన్ బాబు మాత్రం తన కొడుకు మంచు విష్ణు కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే చిరంజీవి మరియు మోహన్ బాబుల మధ్య విభేదాలు వచ్చాయని వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కోల్డ్ వార్ మాట నిజమేనా? ఒకవేళ నిజమే అయితే అది ఎంత దూరం వెళ్లనుంది? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.