Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు పండుగ.. జనవరి 4న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ జనవరి 4న విడుదల కానుంది. సినిమా జనవరి 12న రిలీజ్.
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు పండుగ.. జనవరి 4న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, చిరంజీవి–వెంకటేశ్‌లు తొలిసారిగా వెండితెరపై కలిసి కనిపించనుండటం విశేషంగా మారింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ప్రమోషన్లు జోరుగా సాగుతుండగా, జనవరి 7న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే యూఎస్‌ఏలో ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.