Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం

Chiranjeevi: చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్

Update: 2022-11-20 15:06 GMT

Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా చిరంజీవి ఎంపికయ్యారు. గోవాలో ఘనంగా ప్రారంభమైన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డును కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ శుభాకాంక్షలు తెలిపారు.

గోవాలో 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, సునిల్ శెట్టి, ప్రభుదేవాతో పాటు పలువురు హీరోయిన్లు కూడా హాజరయ్యారు. గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నవంబర్ 20 నుంచి నవంబర్ 28వరకు కొనసాగనున్నాయి. మన దేశానికి చెందిన ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది 79 దేశాలకు చెందిన దాదాపు 280 చిత్రాలను ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. అయితే మన దేశంలో ప్రతీ ఏడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా అంటూ మన దేశం తరపున అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఏడాది ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అఖండ, ట్రిపుల్ ఆర్, బండి, మేజర్, కుదిరామ్ బోస్ వంటి ఐదు తెలుగు చిత్రాలను ప్రదర్శించనున్నారు.

Full View
Tags:    

Similar News