Chhaava in OTT: నేషనల్ క్రష్‌ రష్మిక నటించిన సూపర్‌హిట్‌ సినిమా ఛావా.. ఆ ఓటీటీలో రిలీజ్‌, ఎప్పుడంటే?

Chhava OTT Date: ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ఛావా'. ఇప్పటికే 700 కోట్లు కొల్లగొట్టిన ఈ బాలీవుడ్‌ మూవీలో విక్కీ కౌశల్‌, నేషన్‌ క్రష్‌ రశ్మిక కలిసి నటించారు. అయితే, 'ఛావా' అతిత్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Update: 2025-03-12 10:54 GMT

Chhaava in OTT: నేషనల్ క్రష్‌ రష్మిక నటించిన సూపర్‌హిట్‌ సినిమా ఛావా.. ఆ ఓటీటీలో రిలీజ్‌, ఎప్పుడంటే?

Chhava OTT Date: బాలీవుడ్‌ సినిమా 'ఛావా' ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేసింది. చారిత్రాత్మక సినిమా అయిన ఛావా ఛత్రపతి శివాజీ కుమారుడు అయిన శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఇక నేషనల్‌ క్రష్‌ రష్మిక హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ నేపథ్యంలోనే 700 కోట్లు మార్క్‌ను కూడా తీసింది. ఇటీవలె తెలుగులో కూడా 'ఛావా' ప్రసారం చేశారు. ఇక్కడ కూడా ఛావా క్రేజ్‌ మాములుగా లేదు. హిందీలోనే దాదాపు అందరూ చూసేశారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌ పాత్రకు నూటికి నూరు మార్కలు వేశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్‌ అయిన ఘటనలు కూడా మనం సోషల్‌ మీడియాలో చూశాం.

ఈ సినిమాలో ఔరంగాజేబు పాత్రలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా నటించాడు. ఆయనకు కూడా మంచి కమ్‌బ్యాక్‌ అనే చెప్పాలి. ముంజ్యా, స్త్రీ2 నిర్మాణ సంస్థ అయిన మ్యాడాక్‌ 'ఛావా'ను కూడా నిర్మించింది. ఈ సంస్థకు కూడా బ్యాక్‌ టూ బ్యాక్‌ సక్సెస్‌ అని చెప్పాలి. ఇక ఈ సినమాకు దర్శకత్వం లక్ష్మణ్‌ ఉటేకర్‌.

ఇంతలా క్రేజ్‌ సంపాదించుకున్న 'ఛావా' సినిమా త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది. దీంతో సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ బాలీవుడ్‌ మూవీ ఏప్రిల్‌ 11వ తేదీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సందర్భంగా 'ఛావా' నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే నెల 11వ తేదీ నుంచి ఈ ప్లాట్‌ ఫారమ్‌లో అందుబాటులో ఉండనుంది. మొత్తంగా ఈ బాలీవుడ్‌ మూవీ 11 భాషల్లో ఓటీటీలో అలరించనుంది.

ఇక విక్కీ కౌశల్‌ బాలీవుడ్‌ నటుడు. ప్రముఖ నటి కత్రీనా కైఫ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్‌ 'డంకీ', 'యూరీ', 'శ్యామ్‌ బహదూర్' వంటి ప్రముఖ చిత్రాల్లో కూడా నటించారు. కాగా 'ఛావా' మూవీ హిందీలో దేశవ్యాప్తంగా విడుదలైంది.

Tags:    

Similar News