Chandra Mohan: ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

Chandra Mohan: తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన చంద్రమోహన్

Update: 2023-11-13 01:55 GMT

Chandra Mohan: ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

Chandra Mohan: తెలుగు చిత్రసీమలో గొప్ప నటుల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రమోహన్ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో, ఇవాళ ఉదయం హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చంద్రమోహన్ నివాసం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. మధ్యలో తెలుగు ఫిలిం చాంబర్ వద్ద కొద్దిసేపు ఆపుతారని వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తలను చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఖండించారు. పరిశ్రమలో ఉన్నవారు చాలామంది ఇంటికే వచ్చి నివాళులు అర్పించారని, ఇప్పటికే రెండ్రోజుల సమయం గడిచిందని, అందువల్ల నేరుగా శ్మశానవాటికకు తరలిస్తున్నట్టు కుటుంబసభ్యులు వివరించారు.

Tags:    

Similar News