Chalapathi Rao: కృష్ణా జిల్లా బల్లిపర్రు గ్రామానికి విశేష సేవ చేసిన చలపతి రావు
Chalapathi Rao: చలపతిరావు మరణంతో గ్రామంలో విషాదఛాయలు
Chalapathi Rao: కృష్ణా జిల్లా బల్లిపర్రు గ్రామానికి విశేష సేవ చేసిన చలపతి రావు
Chalapathi Rao: ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన సీనియర్ నటుడు చలపతిరావును సినిమా వారంతా బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహా నటుడు స్వర్గీయ ఎన్‌టీ రామారావు దగ్గరి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు అని గ్రామస్తులు అన్నారు.
చలపతి రావు మరణంతో ఆయన స్వగ్రామం బల్లిపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామానికి చెందిన మంచి నటుడు మరణించడం తమను ఎంతో బాధించిందన్నారు గ్రామస్తులు.. తమ గ్రామానికి ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే వారని వారన్నారు. తమ గ్రామానికి ఎంతో సేవ చేశారని వారన్నారు.