Viral: ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తు పట్టారా.? స్టార్ హీరో భార్య, హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈమె సొంతం..!
ఒకప్పుడు సినిమా తారల గురించి తెలుసుకోవాలంటే అభిమానులు వార్తా పత్రికలను, న్యూస్ పేపర్లను ఫాలో అయ్యే వారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నేరుగా వారే తమ అన్ని వివరాలను పంచుకుంటున్నారు.
Viral: ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తు పట్టారా.? స్టార్ హీరో భార్య, హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈమె సొంతం..!
Viral Photo: సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమా తారల గురించి తెలుసుకోవాలంటే అభిమానులు వార్తా పత్రికలను, న్యూస్ పేపర్లను ఫాలో అయ్యే వారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నేరుగా వారే తమ అన్ని వివరాలను పంచుకుంటున్నారు.
సినిమా అప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు తీరికగా సమాధానం చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియా సెలబ్రిటీలను ఫాలో అయ్యే వారి సంఖ్య ఓ రేంజ్‌లో పెరుగుతోంది. లక్షల్లో ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఈ కారణంగా సోషల్ మీడియాలో ఒక హీరో ఏదైనా పోస్ట్ చేస్తే లక్షల్లో రీచ్ వస్తోంది.
ఇదిలా ఉంటే హీరోలతో పాటు హీరోల భార్యలకు కూడా సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇలాంటి వారిలో ఒకరే పైన ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రిటీ వైఫ్. చీర కట్టులో అద్దంలో సెల్పీ తీసుకుంటున్న ఈ సెలబ్రిటీ భార్య ఎవరో గుర్తుపట్టారా.? ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే ఈ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డినే.
సోషల్‌మీ మీడియా నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో స్నేహ రెడ్డి ఒకరు. తన వ్యక్తిగత వివరాలతో బన్నీతో కలిసి గడిపే క్షణాలను సైతం నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటారు స్నేహ. ఈ క్రమంలో తాజాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరలో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. స్నేహ ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.