Actress: ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు అందాల రాకుమారి..
Actress Nabha natesh childhood photos: ఒకప్పుడు సినీ తారల వ్యక్తిగత విషయాలు పెద్దగా తెలిసేవి కావు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి తారలకు అభిమానులకు మధ్య దూరం తగ్గింది. నేరుగా అభిమానులతో చాట్ చేసే రోజులు వచ్చేశాయ్. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా అదే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ చిన్ననాటి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార తన చిన్న నాటి ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. పైన ఫొటోలో స్కూల్ డ్రస్‌లో ట్రోఫీ తీసుకుంటున్న చిన్నారి ఫొటోను చూశారా? ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా? నటించినవి కొన్ని సినిమాలే అయినా తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోందీ చిన్నది. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిచిందీ హీరోయిన్.
ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది కదూ! అవును.. ఈ చిన్నారి మరెవరో కాదు అందాల తార నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుందీ చిన్నది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను అలరించింది.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 'స్వయంభు' అనే ఒకే ఒక సినిమా ఉంది. అయితే అందం, అభినయం ఉన్నప్పటికీ నభా నటేష్‌కు మాత్రం ఆశించిన స్థాయిలో సినిమ అవకాశాలు అందుకోవడం లేదని చెప్పాలి. మరి ఈ కొత్త ఏడాదైనా నభాకు కలిసి వస్తుందో లేదో చూడాలి.