Guess the actress: కలెక్టర్ కావాలనుకుంది కానీ నటి అయ్యింది.. ఇంతకీ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Guess the actress: చిన్నతనంలో మనం ఎన్నో కలలు కంటుంటాం. ముఖ్యంగా పెద్దయ్యాక డాక్టర్ కావాలని, పోలీస్ కావాలని అనుకుంటాం. కానీ పరిస్థితుల ప్రభావమో, పెద్దయ్యాక మారిన మన అభి రుచుల ఫలితం వల్లో మరేదో అవుతుంటాం. నటీమణులు కూడా ఇందుకు అతీలేం కాదు.
Guess the actress: కలెక్టర్ కావాలనుకుంది కానీ నటి అయ్యింది.. ఇంతకీ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Guess the actress: చిన్నతనంలో మనం ఎన్నో కలలు కంటుంటాం. ముఖ్యంగా పెద్దయ్యాక డాక్టర్ కావాలని, పోలీస్ కావాలని అనుకుంటాం. కానీ పరిస్థితుల ప్రభావమో, పెద్దయ్యాక మారిన మన అభి రుచుల ఫలితం వల్లో మరేదో అవుతుంటాం. నటీమణులు కూడా ఇందుకు అతీలేం కాదు.
పైన ఫొటోలో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న చిన్నది కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఒకప్పుడు ఐఏఎస్ కావాలన్న ఆలోచనతో చదువులో టాపర్‌గా నిలిచిన యువతి... ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార రాశీ ఖన్నా. ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన రాశీ, అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 11 ఏళ్లు గడిచినా, ఇంకా ఆమె క్రేజ్ తగ్గలేదు.
1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశీ ఖన్నా, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. “చదువులో ముందు ఉండే దానిని. ఐఏఎస్ కావాలన్న ఆశ ఉందే తప్ప, నటిగా మారాలన్న ఆలోచన ఎప్పుడూ ఉడేది కాదు. కానీ జీవితం నన్ను సినిమా ప్రపంచంలోకి నడిపించింది,” అని చెప్పింది. మొదట సింగర్ కావాలనుకున్న ఆమె, చివరికి యాక్టింగ్‌ను తన ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం ఆసక్తికరం.
రాశీ తన కెరీర్‌ను ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీరైటర్‌గా ప్రారంభించింది. తర్వాత మోడలింగ్‌కి మారి పలు బ్రాండ్‌లకు బ్రాండ్‌గా మారింది. అదే సమయంలో దర్శకుడు శూజిత్ సిర్‌కార్ ఆమెను హిందీ చిత్రం మద్రాస్ కేఫేలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో జాన్ అబ్రహాంకి జోడీగా నటించింది.
ఇక టాలీవుడ్‌లో ఊహలు గుసగుసలాడే ద్వారా రాశీ తొలి ప్రవేశం చేసింది. తర్వాత ఆమె తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా నటించింది. బెంగాల్ టైగర్, జై లవకుశ, సుప్రీమ్, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగే, సర్దార్, రుద్ర, ఫర్జీ వంటి సినిమాల్లో నటించి తన నటనతో మెస్మరైజ్ చేసింది.
ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుసు కదా అనే చిత్రంపై పూర్తి దృష్టి పెట్టింది. ఈ సినిమాను నీరజా కోన డైరెక్ట్ చేస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాశీకి జోడిగా సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్నాడు.