Tamannaah: ఇండస్ట్రీలో మరో బ్రేకప్? పెళ్లికాకుండానే విజయ్‌తో మిల్కీ బ్యూటీ బ్రేకప్
Tamannaah: పెళ్లిళ్లు, బ్రేకప్ లో వ్యవహారాలతో సినీ సెలబ్రిటీలు ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. వారు ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో చెప్పడం కష్టమే. ఈ మధ్యకాలంలో ప్రేమించుకున్న చాలా మంది సెలబ్రిటీ జంటలు ఊహించని విధంగా విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చారు. త్వరలో పెళ్లి బంధంతో తమన్నా- విజయ్ వర్మ ఒక్కటి కాబోతారని అనుకున్న సమయంలో వారిద్దరి బ్రేకప్ కి సంబంధించిన వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
విజయ్ వర్మతో తమ బంధాన్ని గుట్టుగా ఉంచిన మిల్క్ బ్యూటీ ఆ తర్వాత ఓపెన్ అయింది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్‌లో దర్శనం ఇవ్వడం, మీడియా ముందు ఫొటోలకి పోజులివ్వడం చేస్తుండేవారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరు కలిసి కనిపించడం లేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తమన్నా ఒంటరిగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో తమన్నా- విజయ్ వర్మ లవ్‌కి బ్రేకప్ పడిందని బాలీవుడ్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై తమన్నా కాని లేదంటే విజయ్ కాని స్పందిస్తే అసలు విషయం బయటకు వస్తుంది.
తమన్నా, విజయ్ వర్మలు కనుక వేడుకలు, ఇతరత్రా చోట్ల కలిసి కనిపించకపోతే అందరు కూడా వారిద్దరి రిలేషన్ బ్రేకప్ అయిందని డిసైడ్ అయిపోతారు. ఈ లోపే ఎవరైన స్పందిస్తే బాగుంటుంది. ఇక ఇదిలా ఉంటే తమన్నా గతంలో మాదిరిగా సినిమాలు చేయకపోయిన అడపాదడపా మాత్రం కొన్ని సినిమాలలో మెరుస్తూ రచ్చ చేస్తుంది. మహిళా అఘోరాగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెల 2 ఇటీవలే కుంభమేళాలో టీజర్ లాంచ్ జరుపుకుంది.