Liger Movie: "నమస్తే ఇండియా.. హ్యాపీ దీపావళి" అంటూ మైక్ టైసన్ పోస్టర్
* Mike Tyson Poster: దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ "లైగర్" చిత్రం నుండి మైక్ టైసన్ పోస్టర్ విడుదల
Liger Movie Mike Tyson First Look Released
Mike Tyson Poster: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం "లైగర్". బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. మరోపక్క విజయ్ దేవరకొండ మొదటిసారిగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని "లైగర్" సినిమాతో పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మైక్ టైసన్ "నమస్తే ఇండియా" హ్యాపీ దీపావళి అంటూ లైగర్ మూవీలోని తన పోస్టర్ ని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా ఈ పోస్టర్ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ అమెరికన్ టైగర్ మైక్ టైసన్, ఇండియన్ లయన్ విజయ్ దేవరకొండ ఇద్దరూ పూరి జగన్నాథ్ లైగర్ మూవీలో క్లాష్ అవబోతున్నారని, మైక్ టైసన్ నుండే టైసన్ కు దీపావళి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా "లైగర్" చిత్రాన్ని తెరకేక్కిస్తుండగా మణిశర్మ, తనిష్క్ బాగ్చి సంగీతాన్ని అందిస్తున్నారు.