Boney Kapoor: శ్రీదేవి బయోపిక్‌కు అనుమతి ఇవ్వను

Boney Kapoor: తాను బతికి ఉన్నంత వరకు తన భార్య, దివంగత నటి శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని అగ్ర నిర్మాత బోనీకపూర్‌ అన్నారు.

Update: 2024-04-04 06:24 GMT

Boney Kapoor: శ్రీదేవి బయోపిక్‌కు అనుమతి ఇవ్వను

Boney Kapoor: తాను బతికి ఉన్నంత వరకు తన భార్య, దివంగత నటి శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని అగ్ర నిర్మాత బోనీకపూర్‌ అన్నారు. అజయ్‌దేవ్‌గణ్‌ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘మైదాన్‌' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీకపూర్‌ శ్రీదేవి బయోపిక్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్‌ పర్సన్‌. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ బోనీకపూర్‌ తెలిపారు.

2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు ఆమె కన్నుమూసింది. శ్రీదేవి మరణించి ఆరేళ్ళు అయ్యింది. ఆమె జీవితం వెండితెరపైకి తేవాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. శ్రీదేవి జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, వివాదాలు ఉన్నాయి. కమల్ హాసన్ ని ఆమె వివాహం చేసుకోవాలి అనుకున్నారట. అలాగే నటుడు మిథున్ చక్రవర్తితో శ్రీదేవి వివాహం జరిగిందనే పుకారు ఉంది. ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని తాను రహస్యంగా వివాహం చేసుకున్నానని మిథున్ చక్రవర్తి చెప్పడం కొసమెరుపు. ఆమె మరణం కూడా ఒక మిస్టరీనే. కాబట్టి సినిమాకు కావలసిన నాటకీయత శ్రీదేవి జీవితంలో చోటు చేసుకుంది. ఆమె బయోపిక్ కి విపరీతమైన డిమాండ్, హైప్ ఉంది. కానీ బోనీ కపూర్ అందుకు ఒప్పుకోవడం లేదు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు.  

Tags:    

Similar News