వదిన అంటావా.. అభిమాని వెంటపడి తరిమిన హీరోయిన్.. వైరల్ వీడియో

బాలీవుడ్‌ నటి సారా అలీ ఖాన్‌ మరో సారి వార్తల్లో నిలిచారు.

Update: 2020-02-14 06:54 GMT
Sara File Photo

బాలీవుడ్‌ నటి సారా అలీ ఖాన్‌ మరో సారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే యువ హీరో కార్తిక్‌‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లపై ఆమె స్పందించిన సంగతి తెలిసిందే. కొద్దీ రోజులు సారా దీనిపై స్పందించకపోవడంతో వారిద్దరూ నిజంగానే డేటింగ్‌ చేస్తున్నారని అంతా అనుకున్నారు. సారా అలీ ఖాన్‌ వాటన్నింటికీ చెక్‌ పెట్టేశారు. ఓ ఇంటర్యూలో సారాను కార్తిక్‌తో ప్రేమ విషయం అడగ్గా.. ' కార్తిక్‌తో కలిసి నేను పని చేస్తున్నానని అనుకోవడం లేదు. నేను వీర్‌తో( 'లవ్ ఆజ్ కల్') రిమేక్ కలిసి సెట్‌లో డేటింగ్‌ చేస్తున్నా. సేట్‌లో మేము సారా, కార్తిక్‌లా కాకుండా జో, వీర్‌లా ఉంటాము' అంటూ సమాధానం సారా అలీ ఖాన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సైఫ్ అలీ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా 2009లో నటించిన 'లవ్ ఆజ్ కల్' సినిమా రీమేక్ లో సారా నటిస్తు్న్నారు. హీరోగా కార్తిక్ ఆర్యన్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించారు. ఈ సినీమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 శుక్రవారం విడుదలైంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం కార్తిక్ గల్లీలో యువకులతో కలిసి ఫుట్‌బాల్ క్రీడ ఆడారు. ఇదే సమయంలో సారా ఆలీఖాన్ కూడా వచ్చారు. సారాను చూడగానే అక్కడే ఉన్న ఓ కుర్రాడు.. 'కార్తిక్ అన్నయ్యా.. సారా వదిన వచ్చారు' అంటూ అరిచాడు. కార్తిక్ కాసేపు పగలబడి నవ్వాడు. అంతటితో ఆగని కార్తీక్ నేరుగా ఈ విషయం సారాతో చెప్పారు. 'ఎవర్రా నీకు వదిన' అంటూ నవ్వూతూ అభిమాని వెంట పడ్డారు. ఈ వీడియోను కార్తిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


 

Tags:    

Similar News