Bikramjeet kanwarpal: కరోనాతో యాక్టర్ బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ మృతి
Bikramjeet kanwarpal: ప్రభాస్ సాహో, రామ్ చరణ్ జంజీర్, రానా ఘాజీ అటాక్ వంటి తెలుగు సినిమాల్లో నటించారు
Bikramjeet Kanwarpal:(File Image)
Bikramjeet kanwarpal: కరోనా బారిన పడిన ప్రముఖ హిందీ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ శనివారం(మే1)న కన్నుముశారు. ఈయన మృతితో బాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ అశోక్ పండిత్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "అతి చిన్న వయసులోనే బిక్రమ్ జీత్ మనందరిని విడిచి వెళ్ళిపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది" అంటూ ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఇక బిక్రమ్ జీత్ మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, టాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్జీ మేజర్ బిక్రమ్ 2003లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. హిందీలో అనేక సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. బీటౌన్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
తెలుగులో రామ్ చరణ్ నటించిన జంజీర్, రానా ఘాజీ అటాక్, ప్రభాస్ సాహో వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు బిక్రమ్ జీత్. కరోనా వైరస్.. సినీ పరిశ్రమలో అడుగడుగున అంతులేని విషాదాన్ని నింపుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలువురు నటీనటులు మరణించగా.. మరికొందరు ఈ వైరస్‌తో పోరాడుతున్నారు.