Biggboss 9 : ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో తనూజ లవ్ స్టోరీ లీక్.. కళ్యాణ్ పేరు చెప్పగానే రియాక్షన్ చూశారా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోని 25వ ఎపిసోడ్ ప్రేక్షకులకు పండుగలా అనిపించింది.
Biggboss 9 : ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో తనూజ లవ్ స్టోరీ లీక్.. కళ్యాణ్ పేరు చెప్పగానే రియాక్షన్ చూశారా?
Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోని 25వ ఎపిసోడ్ ప్రేక్షకులకు పండుగలా అనిపించింది. ఎపిసోడ్ మొత్తం కుర్చీ మడతపెట్టి పాటతో ఫుల్ జోష్‌తో మొదలైంది. ఈ ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, సరదా, రొమాన్స్, గేమ్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాయి. ముఖ్యంగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో లవ్ స్టోరీలు, కళ్యాణ్ కామెంట్స్ హైలైట్‌గా నిలిచాయి.
ఎపిసోడ్ ప్రారంభంలో ఒంటరిగా ఉంటున్న భరణిని చూసి సంజన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. "మీరు ఎవరితోనూ కలవడం లేదు" అంటూ ఆమె బాధపడగా, భరణి గట్టిగా సమాధానం ఇచ్చారు. "పది మంది మధ్యలో ఒంటరిగా ఉండటం అనేది, ఆ వ్యక్తి స్వయంగా క్రియేట్ చేసుకున్నదే" అంటూ ఆయన తన మౌనం వెనుక ఉన్న ఆలోచనను స్పష్టం చేశారు. మరోవైపు, ఇమ్మానుయేల్ తన కామెడీ మోడ్‌లోకి వచ్చి, తనూజను దిస్ ఈజ్ యాక్టింగ్.. సీరియల్ యాక్టింగ్ అంటూ ఆటపట్టించాడు.
రీతూ, తనూజ, ఇమ్మానుయేల్, కళ్యాణ్ పడాల, దమ్ము శ్రీజ కలిసి ఆడిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ గేమ్‌లో తనూజ తన బాయ్‌ఫ్రెండ్ పేరు హృతిక్ రోషన్ అని సరదాగా చెప్పింది. అయితే, కళ్యాణ్ పడాల వంతు వచ్చినప్పుడు.. ఈ హౌస్‌లో లవ్ చేయొచ్చు అనిపించే వారు ఎవరు? అని అడగ్గా, కళ్యాణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనూజ పేరు చెప్పేశాడు. ఈ కామెంట్‌తో కళ్యాణ్ ఎపిసోడ్ మొత్తం హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తనూజకి ట్రూత్ రావడంతో, ఆమె తన ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పింది. తన ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలో డాన్స్ క్లాస్‌లో మొదలైందని, అతని పేరు కూడా కళ్యాణే అని చెప్పింది. తర్వాత వచ్చిన డేర్ టాస్క్‌లో భాగంగా, తనూజ, కళ్యాణ్ పడాల ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.
హౌస్‌లో రీతూ, డీమాన్ పవన్ మధ్య బాండింగ్ మరింత పెరిగింది. వీరిద్దరూ ఈ మధ్య ఒకే మంచం పంచుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. ఇది చూసిన ఇమ్మానుయేల్ సరదాగా బిగ్ బాస్.. వీళ్లు పడుకున్నారు అంటూ సెటైర్ వేసాడు. అయితే, రీతూ, పవన్ ఇద్దరూ కలిసి మైండ్ గేమ్‌కి దిగి మేము పడుకోలేదు అంటూ నవ్వుతూ దాటవేశారు.