Biggboss 9 : కెప్టెన్సీ టాస్క్‌లో హై డ్రామా.. వెన్నుపోటు పోడిచిన డీమాన్ పవన్.. ఎమోషనల్ అయిన కళ్యాణ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ప్రేక్షకులను అలరించే టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య భావోద్వేగాలు, గొడవలు, ఊహించని మలుపులతో దూసుకుపోతోంది.

Update: 2025-10-04 06:00 GMT

Biggboss 9 : కెప్టెన్సీ టాస్క్‌లో హై డ్రామా.. వెన్నుపోటు పోడిచిన డీమాన్ పవన్.. ఎమోషనల్ అయిన కళ్యాణ్

Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ప్రేక్షకులను అలరించే టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య భావోద్వేగాలు, గొడవలు, ఊహించని మలుపులతో దూసుకుపోతోంది. ఈ వారం పవర్ కార్డు టాస్క్, కెప్టెన్సీ టాస్క్, దసరా పండుగ ప్రత్యేక ఎపిసోడ్‌లో జరిగిన కీలక సంఘటనలు, ఎమోషనల్ డ్రామా, కొత్త కెప్టెన్ ఎంపిక, అలాగే రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి వివరంగా తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్‌లో పవర్ కార్డు టాస్క్ ఎల్లో, రెడ్, బ్లూ టీమ్‌లుగా విడిపోయి జరిగింది. గార్డెన్‌లో ఉన్న హిప్పోకు ఆరెంజ్ బాల్‌ను సురక్షితంగా చేర్చడమే టాస్క్ ప్రధాన లక్ష్యం. ఇతర టీమ్‌ల అడ్డుకోవడంతో ఈ టాస్క్ చాలా ఫిజికల్, ఉత్కంఠభరితంగా మారింది. ఇమ్మాన్యుయల్ తన ఆటతీరుతో హైలైట్ అయ్యాడు. గేమ్ ప్రమాదకర స్థాయికి చేరడంతో, సంచాలకుడు భరణి టాస్క్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. చివరికి రెడ్ టీమ్ నుండి ఇమ్మాన్యుయల్ - కళ్యాణ్ విజయం సాధించి పవర్ కార్డును పొందారు. వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా అర్హత సాధించారు.

బిగ్ బాస్ వీరిని మూడు జంటలను ఎంపిక చేయమని కోరగా, సుమన్ - తనూజ, సంజన - రాము, రీతూ చౌదరి - ఫ్లోరా షైనీ ఎంపికయ్యారు. మొదటి రౌండ్‌లో సుమన్ - తనూజ టాస్క్ నియమాలను ఉల్లంఘించడంతో, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వారిని డిస్‌క్వాలిఫై చేశారు. ఈ పరిణామంతో తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనై, వాష్‌రూమ్‌లో ఏడ్చింది. రీతూ చౌదరి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. తర్వాతి రౌండ్లలో రాము, రీతూ విజయం సాధించారు. ఫలితంగా ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రాము, రీతూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు.

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా, పవన్ రీతూ చెప్పిన మాట విని కళ్యాణ్‌ను రేసు నుంచి తప్పించాడు. తర్వాత శ్రీజ ఇమ్మును తొలగించింది. భరణి రీతూని తొలగించడంతో రాము కొత్త కెప్టెన్‌గా అవతరించాడు. కెప్టెన్సీ రేసు నుంచి తప్పించబడిన కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను నమ్మిన బెస్ట్ ఫ్రెండ్స్ అన్యాయం చేశారంటూ వాష్‌రూమ్‌లో ఏడుస్తూ బయటకు వచ్చి టిష్యూను నేలకేసి కొట్టాడు. శ్రీజ వచ్చి ఓదార్చినా, కళ్యాణ్ ఆగలేదు.

తనూజ కళ్యాణ్ వద్దకు వచ్చి, ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదని చెప్పింది. దానికి కళ్యాణ్, తాను హౌస్‌లో ఎక్కువగా నమ్మింది తనూజ, రీతూలను అని చెప్పాడు. అయితే తనూజ.. నన్ను కలపకు, నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు అని చెప్పడంతో కళ్యాణ్ మరింత బాధపడ్డాడు. రీతూ వచ్చి బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, నన్ను ఎలా తీసేయమని చెప్తావు అని అడగ్గా, కళ్యాణ్ నువ్వు మోసం చేయలేదా అని ప్రశ్నించాడు. రీతూ ఓపిక కోల్పోయి ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ ఎమోషనల్ డ్రామా ఈ వారం ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

దసరా పండుగ ప్రత్యేక ఎపిసోడ్ ప్రేక్షకులను ఎమోషనల్ రైడ్‌లోకి తీసుకెళ్లింది. రాము రాథోడ్ తన హార్ట్ టచింగ్ మాటలతో ప్రేక్షకులను కదిలించాడు. ప్రతి దసరాకు అమ్మా-నాన్నతో ఉండేవాడిని. వారికి జమ్మిపెట్టి కాళ్ళు మొక్కేవాడిని. ఇప్పుడు ఇక్కడ నా డాడీ-మమ్మీ ఇద్దరూ ఉన్నారు అంటూ భరణి కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశాడు. భరణి రాముని కౌగిలించుకుని వారి అనుబంధాన్ని చాటాడు.

ఇమ్మాన్యుయల్ తన లవ్ స్టోరీని షేర్ చేసుకుంటూ.. ప్రతి దసరా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండేవాడిని. కానీ ఈ దసరా నాకు చాలా మిస్ అవుతోంది అంటూ రాము రాథోడ్‌ని కౌగిలించుకుని ఎమోషన్ అయ్యాడు. ఈ ఎమోషనల్ సన్నివేశాల తర్వాత కంటెస్టెంట్లు రైన్ డ్యాన్స్‌లో పాల్గొని దసరాను ఉల్లాసంగా ఎంజాయ్ చేశారు. సుమన్ శెట్టి లక్స్ పాప ఆశా షైనీ జంట వానలో తడిసి ముద్దవుతూ ఇచ్చిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

గత వారం మధ్యలోనే దివ్య నికితా వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగు పెట్టింది. అదే షో నుంచి మరొకరు కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశం ఉంది. సెలబ్రిటీ కోటాలో సీరియల్ హీరోయిన్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News