Bigg Boss Telugu 9: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫైర్ బ్రాండ్ రీతూ చౌదరి ఎలిమినేట్.. కారణం ఏంటంటే

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది ఘట్టానికి చేరువవుతున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

Update: 2025-12-07 06:00 GMT

Biggboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది ఘట్టానికి చేరువవుతున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఇప్పటికే కల్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో 13వ వారం ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్‌ను ఇచ్చింది. ఎలిమినేషన్ రేసులో సుమన్ శెట్టి లేదా సంజన గల్రాని బయటకు వెళ్తారని అంతా భావించగా ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ రీతూ చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు లీకులు వచ్చాయి. డబుల్ ఎలిమినేషన్ వస్తుందనే ప్రచారానికి చెక్ పడుతూ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది.

13వ వారం నామినేషన్లలో తనూజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి ఉన్నారు. ఆన్‌లైన్ పోల్స్‌ ప్రకారం, సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి అత్యధిక ఓట్లతో (సుమారు 27.99%) మొదటి స్థానంలో ఉండగా, డిమాన్ పవన్ రెండో స్థానంలో ఉన్నాడు. చివరి స్థానాల్లో సుమన్ శెట్టి, సంజన గల్రాని ఉండటంతో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేషన్ ఖరారైంది.

నిజానికి చాలా పోల్స్‌లో రీతూ చౌదరి టాప్-2లో కూడా ఉండేది. ఆమె ఎంటర్‌టైన్‌మెంట్, డిమాన్ పవన్‌తో లవ్ ట్రాక్ కారణంగా బిగ్ బాస్ ఆమెను ప్రోత్సహించాడనే టాక్ కూడా ఉంది. అయితే చివరి నిమిషంలో ఓటింగ్ లెక్కలు మారడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. డిమాన్ పవన్‌తో రీతూ ఎక్కువసేపు సన్నిహితంగా ఉండటం, రాత్రిపూట ప్రైవేట్ బిహేవియర్ ప్రదర్శించడం ప్రేక్షకులకు నచ్చలేదు. సంజన ఈ ప్రైవేట్ అంశాన్ని హౌస్‌లో ఓపెన్‌గా చర్చించినప్పుడు, రీతూ బిగ్ బాస్‌ను, హోస్ట్ నాగార్జునను ఎదురించిన తీరు నెటిజన్లకు నచ్చలేదు. రీతూ టాస్క్‌లలో గట్టి పోటీ ఇచ్చినా, బిహేవియర్, మెచ్యూరిటీ, పబ్లిక్ కనెక్షన్ విషయంలో వెనుకబడిందని విమర్శలు వచ్చాయి. ఈ కారణాల వల్ల సోషల్ మీడియాలో సంజనకు అనూహ్యంగా మద్దతు పెరిగి, ఆమె టాప్ జోన్‌లోకి వెళ్లగా, రీతూ మాత్రం డేంజర్ జోన్‌లోకి పడిపోయింది.

13 వారాలు హౌస్‌లో ఉన్న రీతూ చౌదరికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఆమెకు రోజుకు రూ.40 వేల వరకు పారితోషికం ఇచ్చినట్లు ఒక టాక్ ఉంది. ఈ లెక్కన, ఆమె మొత్తం 13 వారాలకు రూ.35.75 లక్షల నుంచి రూ.45.5 లక్షల వరకు సంపాదించి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా రీతూను నిలపవచ్చని సమాచారం.

Tags:    

Similar News