Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ట్విస్ట్.. సంజనకు రీ-ఎంట్రీ, ప్రియ ఎలిమినేషన్ కన్‌ఫర్మ్?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది.
Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ట్విస్ట్.. సంజనకు రీ-ఎంట్రీ, ప్రియ ఎలిమినేషన్ కన్‌ఫర్మ్?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. హైడ్రామా, ఊహించని ట్విస్టులతో షో రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ అనూహ్యంగా ప్రవర్తించి, హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. ముందుగా, సంజనను మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేసినట్టు ప్రకటించి, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపడం జరిగింది. ఆ తర్వాత, శనివారం ఎపిసోడ్‌లో సంజనను స్టేజ్ మీదకు తీసుకొచ్చి, బిగ్ బాస్ ఆమెకు గుడ్ బై చెప్పించాడు. అయితే, నాగార్జున ఇక్కడే మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తున్నట్టు ప్రకటిస్తూ, హౌస్‌లోని నలుగురు కంటెస్టెంట్లు కొన్ని త్యాగాలు చేస్తే సంజన తిరిగి హౌస్‌లోకి రావచ్చని ప్రకటించాడు.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి హౌస్‌మేట్స్ ముందుకు వచ్చారు. ఇమ్మాన్యుయెల్ తన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను త్యాగం చేశాడు. తనూజ కాఫీ తాగకుండా ఉండేందుకు అంగీకరించింది. అయితే, శ్రీజ మాత్రం తన డ్రెస్సుల్ని త్యాగం చేయడానికి ఒప్పుకోలేదు. రీతూ చౌదరి తన జుట్టును కత్తిరించగా, భరణి తనకు ఎంతో ఇష్టమైన లాకెట్‌ను త్యాగం చేయడం విశేషం.
దీంతో సంజనకు హౌస్‌లోకి తిరిగొచ్చే అవకాశం కలిగింది. గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ను అందరూ ఊహించినా, బిగ్ బాస్ అందరికీ షాక్ ఇస్తూ, సంజనకు మరో అవకాశం ఇచ్చి గేమ్‌ను మళ్ళీ మలుపు తిప్పాడు. మూడో వారం చివరికి బిగ్ బాస్ షో ఎమోషనల్, స్ట్రాటజికల్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి గేమ్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, హౌస్‌లో నడుస్తున్న వ్యూహాలు, తప్పుడు వ్యాఖ్యలపై నాగార్జున తనదైన శైలిలో క్లాస్ పీకారు. హరీష్ చేసిన లత్కోర్ పనులు వ్యాఖ్యపై తీవ్రంగా స్పందిస్తూ, అలాంటి పదాలు హౌస్‌లో వాడకూడదని హెచ్చరించాడు. శ్రీజ కెప్టెన్సీ టాస్క్‌లో చేసిన తప్పులను ఫుల్ వీడియో చూపించి ప్రశ్నించాడు. రీతూ చౌదరి ప్రతిదానికీ ఏడుస్తుందని నిలదీయగా, కళ్యాణ్‌ను గేమ్‌లో చురుకుగా పాల్గొనాలని గట్టిగా చెప్పారు.
ఈ వారం నామినేషన్‌లో హరీష్, ఫ్లోరా, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, ప్రియ, రీతూ చౌదరి ఉన్నారు. తక్కువ ఓట్లతో ప్రియ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆమె హౌస్ నుండి బయటకు వెళ్లడం దాదాపు కన్‌ఫర్మ్ అయిందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం.. రాము రాథోడ్ ప్రస్తుతం టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలు త్రుటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న ఫ్లోరా షైనీ ఈసారి ఏకంగా రెండో స్థానంలో నిలవడం గమనార్హం. కాంట్రవర్సీ క్వీన్ రీతూ చౌదరి మూడో స్థానంలో కొనసాగుతోంది. మాస్క్ మ్యాన్ హరీష్ నాలుగో స్థానంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్, ప్రియ ఐదు, ఆరు స్థానాల్లో ఉండి డేంజర్ జోన్‌లో ఉన్నారు.
ముఖ్యంగా ప్రియ, ఈ సీజన్ ప్రారంభంలో కామనర్ కోటాలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, అనవసరంగా సెలబ్రిటీలతో గొడవకు దిగడం, యాటిట్యూడ్ చూపించడం వల్ల నెగటివ్ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకుంది. గతవారం సుమన్ శెట్టితో గొడవ ప్రియకు మరింత మైనస్‌గా మారి, ఓటింగ్‌లో ప్రతికూల ప్రభావం చూపింది. మొత్తంగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం చివరికి ఎమోషనల్, స్ట్రాటజికల్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్య నిఖిత హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఇక్కడి నుంచి గేమ్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.