Bigg Boss Telugu 9 : వివాదాలపై హౌస్ మేట్స్‌కు క్లాస్ పీకిన నాగార్జున..ఈ వారం ఊహించని కంటెస్టెంట్ అవుట్
Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ఈ వారం మాటల తూటాలు, వివాదాలకు కొదవే లేదు.
Bigg Boss Telugu 9 : వివాదాలపై హౌస్ మేట్స్‌కు క్లాస్ పీకిన నాగార్జున..ఈ వారం ఊహించని కంటెస్టెంట్ అవుట్
Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ఈ వారం మాటల తూటాలు, వివాదాలకు కొదవే లేదు. శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వచ్చి, వారమంతా జరిగిన గొడవలు, కంటెస్టెంట్స్ తప్పులపై తనదైన స్టైల్‌లో క్లాస్ పీకారు. ముఖ్యంగా రీతూ-మాధురి, సంజన-దివ్యల మధ్య మాటల యుద్ధంపై నాగ్ వివరంగా మాట్లాడారు. హౌస్‌లో అసభ్యంగా మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయడంపై నాగార్జున సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చారు. మరోవైపు, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు సమాచారం. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆయేషా వెళ్లిపోగా, వీకెండ్‌లో రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 9లో శనివారం నాగార్జున రివ్యూ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. నాగ్ ఈ వారం జరిగిన ప్రధాన వివాదాలపై దృష్టి సారించి, కంటెస్టెంట్స్‌కు గట్టి క్లాస్ ఇచ్చారు. టాస్క్‌లో మాధురి టీమ్‌లో ఉండి కూడా రీతూ పవన్‌కు డబ్బు ఇవ్వాలని అనుకోవడం సరైనది కాదని నాగార్జున స్పష్టం చేశారు. రీతూ మాట జారడం తప్పైనా మాధురి నేలకేసి కొడతా వంటి మాటలు వాడటం కూడా తప్పే అని హెచ్చరించారు. మాధురి తన వాదనలు కొనసాగించగా, నాగార్జున మీరు తోపు అయితే బయట చూసుకోండి.. బిగ్ బాస్ హౌస్‌లో కాదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
రాము పక్కన కూర్చుంటే తనూజ అసహ్యంగా ప్రవర్తించడంపై నాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా ఇబ్బంది పెడితే సున్నితంగా చెప్పాలని సూచించారు. దివ్యను రోడ్ రోలర్ అంటూ బాడీ షేమింగ్ చేసిన సంజనకు నాగార్జున వీడియోలు చూపించి మరీ క్లాస్ పీకారు. వెంటనే దివ్యకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. సంజన సారీ చెప్పినా, దివ్య ఇది ఆమె అలవాటు.. మళ్లీ చేస్తుంది అంటూ క్షమాపణను అంగీకరించలేదు.
కంటెస్టెంట్స్‌కు వారి లోపాలను సూచించే బోర్డులు మెడలో వేయగా మాధురికి ఇగోయిస్టిక్ వంటి ట్యాగ్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆమెకు నాగ్ శిక్ష విధించారు. ఈ వారం ఇమ్మాన్యుయేల్ మళ్లీ కెప్టెన్ అయ్యి తన గ్రాఫ్‌ను పెంచుకున్నాడు. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో నాగార్జున బెలూన్ గేమ్ ఆడించారు. కళ్యాణ్‌కు గ్రీన్ కలర్ రావడంతో అతను ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు. రీతూ, దివ్య, సాయి, తనూజ, రమ్య, రాము, సంజన ఇంకా ఎలిమినేషన్ పరిధిలో ఉన్నారు.
ఈ సీజన్ ముందు నుంచి చెప్తున్నట్టుగానే ట్విస్ట్‌లతో సాగుతోంది. ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్‌తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. టైఫాయిడ్, డెంగ్యూ కారణంగా మిడ్ వీక్ ఆయేషా హౌస్ నుండి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ వారం అఫీషియల్ ఎలిమినేషన్‌గా రమ్య మోక్ష ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఓటింగ్ పరంగా రమ్యకు చాలా తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. రమ్య మోక్ష కేవలం రెండు వారాలు హౌస్‌లో ఉండి రూ. 3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.