Bigg Boss Telugu 9 : నువ్వు అమ్మాయిల పిచ్చోడివా?..కళ్యాణ్‌ను కడిగేసిన శ్రీజ.. మాధురి, తనూజలకు షాక్!
బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సీజన్ 9 ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది.
Bigg Boss Telugu 9 : నువ్వు అమ్మాయిల పిచ్చోడివా?..కళ్యాణ్‌ను కడిగేసిన శ్రీజ.. మాధురి, తనూజలకు షాక్!
Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సీజన్ 9 ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. గత సీజన్‌లలో మాదిరిగానే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లను హౌస్‌లోకి తీసుకువచ్చిన బిగ్ బాస్, వారితోనే నామినేషన్స్ చేయించారు. కాకపోతే ఈసారి ఈ ప్రక్రియను కత్తితో పొడిచి నామినేట్ చేసే వినూత్న పద్ధతిలో నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, కంటెస్టెంట్‌లపై తమ ఆగ్రహాన్ని, అభిప్రాయాలను వెళ్లగక్కారు. ముఖ్యంగా ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లిన దమ్ము శ్రీజ, హౌస్‌లో అడుగు పెట్టగానే మాధురి, తనూజ, కళ్యాణ్‌లను మాటలతో దుమ్ము దులిపింది.
బిగ్ బాస్ తెలుగు 9 లో 50 రోజులు పూర్తయ్యాయి. ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ అస్సలు ఊహించని విధంగా జరిగింది. ఈ వారం నామినేషన్స్ కోసం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన వారు ఒక కత్తితో స్వయంగా ఒకరిని నామినేట్ చేసి, ఆ కత్తిని ఇంకొకరికి ఇవ్వాలి. హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియ, సంజనను నామినేట్ చేసింది. బాడీ షేమింగ్ చేయడం, రోడ్ రోలార్ అనడం సరదా కాదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్రంగా క్లాస్ పీకింది. అనంతరం కళ్యాణ్‌కు కత్తి ఇచ్చింది. కళ్యాణ్ తన నామినేషన్ పవర్‌ను ఉపయోగించి రాము రాథోడ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ఆరోపించాడు. రాము పనిమాలిన నిర్ణయాలు తీసుకుని టాస్క్‌లలో టీమ్‌ను ఓడించాడని చెప్పాడు.
డబుల్ ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లిన దమ్ము శ్రీజ గ్రాండ్‌గా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. మొదట కళ్యాణ్ హగ్ ఇవ్వబోతే నేను పొడవటానికి వస్తే నన్ను పొడుస్తారేంది అంటూ కౌంటర్ వేసింది. కూర్చోగానే శ్రీజ, మాధురిని టార్గెట్ చేసింది. 'మాధురి గారా.. మాస్ మాధురా.. రాజు గారా' అంటూ పేరు తెలియదని గొడవను మళ్లీ ప్రారంభించింది. మాధురి గొడవకు సిద్ధం కాగా, శ్రీజ గేమ్ ఆడటానికి వచ్చారా.. బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అని ప్రశ్నించింది. మాధురి అవును బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చా అని చెప్పడంతో శ్రీజ ముఖం తిప్పుకుంది. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేంతవరకు శ్రీజ హౌస్‌లో తన వాగ్ధాటిని కొనసాగించింది.
శ్రీజ, తనూజను ప్రశ్నించింది. ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. అయినా మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి జాలీగా రాజు రాజు అని బాండింగ్ ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు అంటూ రమ్య మోక్ష విషయాన్ని గుర్తుచేసింది. అలాగే, ఇమ్మాన్యుయేల్ వంటి వారి సపోర్ట్‌తో ఎంతకాలం గేమ్ ఆడతారని నేరుగా ప్రశ్నించింది. తన నామినేషన్ కోసం కళ్యాణ్‌ను ఎంచుకొని, కత్తి బలంగా దింపింది. "నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు.. అర్థమవుతుందా అంతమంది ముందు నిన్ను అమ్మాయిల పిచ్చోడు అన్నారు నిన్ను.. దానికి ఏం మాట్లాడావ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నావ్?" అంటూ ప్రశ్నించింది. రమ్య, మాధురి వంటి వారిని నామినేట్ చేయకుండా, సంజన మీద తుప్పాస్' రీజన్ చెప్పి నామినేట్ చేయడం నీ సేఫ్ గేమ్‌ను బట్టి ఇదంతా తెలుస్తోందని కళ్యాణ్‌ని గట్టిగా వాయించేసింది.
మనీష్, ఫ్లోరా కూడా హౌస్‌మేట్స్‌పై తమ అభిప్రాయాలను బలంగా చెప్పారు. ఈ వారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజన, డిమోన్ పవన్, కళ్యాణ్ నామినేషన్లలో ఉన్నారు. ఎలిమినేట్ అయిన వారిలో కొందరు బిగ్ బాస్ ట్రోఫీ కోసం పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నారంటూ బిగ్ బాస్ రీ-ఎంట్రీ గురించి హింట్ ఇచ్చారు. శ్రీజ పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో హౌస్‌లో ఇంకెవరు అడుగుపెడతారో చూడాలి.