Bigg Boss Telugu 9 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా? ఫ్లోరా షైనీ ఔట్ కావడానికి అతి పెద్ద మైనస్ పాయింట్ అదే
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ ఊపందుకుంటోంది. తాజాగా శనివారం ఎపిసోడ్ ఎలిమినేషన్ ఉత్కంఠను రెట్టింపు చేసింది.
Biggboss : ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా? ఫ్లోరా షైనీ ఔట్ కావడానికి అతి పెద్ద మైనస్ పాయింట్ అదే
Biggboss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ ఊపందుకుంటోంది. తాజాగా శనివారం ఎపిసోడ్ ఎలిమినేషన్ ఉత్కంఠను రెట్టింపు చేసింది. ఈ వారం ఆటలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇమ్మాన్యుయేల్ మరోసారి గోల్డెన్ స్టార్‌గా నిలిచాడు. అయితే, నాగార్జున కంటెస్టెంట్లలోని లోపాలను ఎత్తిచూపడం ద్వారా హౌస్‌లో ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యంగా కెప్టెన్ రాము, తనూజలతో పాటు పవర్ అస్త్ర కోసం పోటీ పడిన ఇమ్మాన్యుయేల్ ఆట అదరగొట్టాడు. ఈ వారం రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ ఎలిమినేషన్‌కు అత్యంత దగ్గరగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఈ వారం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఇమ్మాన్యుయేల్ మరోసారి గోల్డెన్ స్టార్‌ల జాబితాలోకి ఎక్కాడు. గోల్డెన్ స్టార్‌గా నిలిచిన ఇమ్మాన్యుయేల్, పవర్ అస్త్ర కోసం జరిగిన పోటీలో రాము, కళ్యాణ్, తనూజ, దివ్య, భరణి లతో పోటీ పడ్డాడు. ఈ పోటీలో కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన తనూజ, రాము కీని బ్రేక్ చేసింది. "రాము ఆటలో నిలకడ చూపడం లేదు, స్టాండ్ తీసుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని తనూజ వివరణ ఇచ్చింది.
నాగార్జున, శ్రీజ ఆటపై ప్రశంసలు కురిపిస్తూనే, ఆమె మాట్లాడే తీరుపై క్లాస్ తీసుకున్నారు. "శ్రీజ గేమ్‌లో గట్టి పోటీని ఇస్తున్నా, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉంటూ, మాట్లాడకూడని చోట మాట్లాడి సమస్యలు తెచ్చుకుంటోంది" అని నాగార్జున హెచ్చరించారు. శ్రీజ, రీతూ చౌదరి మధ్య ఉన్న టెన్షన్‌ను నాగార్జున ప్రస్తావించారు. "పవన్ తమకు సపోర్ట్ చేయడం రీతూకి ఇష్టం లేదు, అందుకే నన్ను టార్గెట్ చేస్తోంది" అని శ్రీజ చెప్పగా, "ఆడే వాళ్లని చెడగొడుతూ గేమ్ మీద ప్రభావం చూపిస్తున్నావు" అంటూ నాగార్జున రీతూపై సెటైర్లు వేశారు.
ఐదో వారం నామినేషన్లలో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఇమ్మాన్యుయేల్, రాము ఇమ్యూనిటీతో సేఫ్‌గా ఉండగా, భరణి, దివ్య, కళ్యాణ్, తనూజ కూడా టాస్కులలో గెలిచి సేఫ్ జోన్‌లో ఉన్నారు. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఓటింగ్‌లో అత్యంత తక్కువ మార్జిన్‌తో ప్రమాదంలో ఉన్నవారు రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ. వీరు వంద శాతం ప్రయత్నించినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే బలమైన పుకారు నడుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ అయితే, ఫ్లోరా, రీతూ ఇద్దరూ హౌస్ నుంచి బయటకు వెళ్లడం ఖాయం. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరా షైనీ మొదటి నుంచి హౌస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రేక్షకులకు ఆమె ఆట తీరు రుచించలేదు. ఆమెపై ఎటువంటి వ్యతిరేకత లేకపోయినా, ఇంపాక్ట్ చూపించకపోవడమే అతిపెద్ద లోపం. 'తిన్నామా, పడుకున్నామా, గేమ్స్ ఆడామా' అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరంగా ఉంది.
సంచాలక్‌గా కూడా తప్పులు చేయడంతో, ఆమె ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే ఈ వారం ఆమెను డైరెక్ట్‌గా నామినేట్ చేసి, ఎలిమినేషన్‌కు గట్టి స్కెచ్ వేశారని టాక్ నడుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఫ్లోరా ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.