Bigg Boss 5 Highlights: కవ్వించిన సంచాలకులు.. నవ్వించిన విజే సన్నీ

* బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ హైలైట్స్

Update: 2021-10-14 05:59 GMT

Bigg Boss 5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నాలుగు టీమ్స్.., ఇద్దరు సంచాలకులు మధ్య గొడవలు హౌస్ లో హీట్ పుట్టించగా.., విజే సన్నీ మాత్రం తన మాటలతో మరోసారి బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మంగళవారం ఎపిసోడ్ లో రవి టీంకి వచ్చిన పవర్ తో సన్నీ టీంలో ఉన్న అన్ని బొమ్మలను వాళ్ళు స్విచ్ చేసి తీసుకోవడం.., ఆ సమయంలోనే ఆని మాస్టర్.. శ్వేతవర్మ దగ్గర ఉన్న బొమ్మలను లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం జరిగింది.

స్నాక్స్ టైమ్ లో గొడవపడి డిన్నర్ చేసే సమయానికి వారి మధ్య ఉన్న గొడవను ఒకరితో ఒకరు మాట్లాడుకొని మళ్ళీ మాములు అవడం జరిగింది. ఇక రవి సన్నీ టీం నుండి బొమ్మలను స్విచ్ చేసుకున్న తరువాత అంతకు ముందు గేమ్ మధ్యలో రవి.. విజే సన్నీ టీంకి సపోర్ట్ చేస్తానని మాట్లాడిన మాటలకు తరువాత అతడు చేసిన పనులు మానస్, సన్నీలకు కోపాన్ని తెప్పిస్తాయి.. ఆ తరువాత గేమ్ ఓడిపోయామనే బాధలో ఉన్న మానస్ కి విజే సన్నీ చెప్పే మాటలు వారిద్దరి మధ్య ఉన్న స్నేహాబంధాన్ని అద్దంపట్టాయి.

తాము చేసిన బొమ్మలన్ని రవి టీంకి పోయిన పట్టువదలని విక్రమార్కుడిలా విజే సన్నీ టీం తరువాత రోజు ఆడి మిగిలిన టీమ్స్ తో పోటీపడుతూ బొమ్మల్ని తయారు చేసింది. టాస్క్ మొదలైనప్పటి నుండి సిరి హనుమంత్ ఏకపక్షంగా ఇతర టీమ్స్ కి మాత్రమే సపోర్ట్ చేయడంతో పాటు సన్నీ, ప్రియ టీమ్స్ కి మాత్రమే నియమాలను పెట్టడంతో సన్నీ.. సంచాలక్ సిరి హనుమంత్ పై రోజుకో రకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రూల్స్ మారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

ఇక టాస్క్ లో విజే సన్నీ తనపై అరిచినందుకు గానూ అందరి ముందు క్షమాపణ చెప్పాలని సిరి హనుమంత్ కోరడం, అందుకు సన్నీ పవన్ కళ్యాణ్ రేంజ్ లో నేను చెప్పను అంటే చెప్పను అనే డైలాగ్ తో నవ్విస్తూనే సారీ చెప్పడానికి ససేమిరా అన్నాడు. ఆ తరువాత ఆని మాస్టర్, కాజల్ క్షమాపణ చెప్పాలని ఎంత అడిగిన విజే సన్నీ చెప్పను అనడం.. అందుకు మానస్ కూడా సపోర్ట్ చేయడం చూడొచ్చు. మరోపక్క ప్రియ..కొత్త కొత్త రూల్స్ పెట్టడంపై సంచాలకులు అయిన సిరి, కాజల్ పై ఫైర్ అవడం అందుకు సిరి బాధపడటం.. శన్ను ఓదార్చడం వెంటవెంటనే జరిపోయాయి.

మొత్తానికి బుధవారం టాస్క్ లో చివరికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ లో సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించని సంచాలకులను.. రూల్స్ బ్రేక్ చేస్తూ ఆడిన ఒకటి రెండు టీమ్స్ ను కెప్టెన్సీ పోటీదారుల నుండి తొలగించబోతున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News