Bigg Boss 5 Promo: ఎమోషనల్ గా సాగనున్న బిగ్ బాస్ మండే నామినేషన్ ప్రక్రియ
* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రోమో తాజాగా విడుదలైంది.
Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)
Bigg Boss 5 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రోమో తాజాగా విడుదలైంది.. ఈ వారం నామినేషన్స్ మాటల యుద్ధంగా కాకుండా తమ ఇంటి సభ్యులను ఎంతగా మిస్ అవుతున్నారో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ బాధపడుతుండటం ప్రోమోలో చూడొచ్చు.ఇక తమ ప్రియమైన వ్యక్తుల నుండి వచ్చిన లెటర్ ని శణ్ముఖ్ తీసుకోడానికి నిరాకరిస్తూ తన తల్లి క్యాన్సర్ నుండి బయటపడిన సమయంలో..., తన అమ్మమ్మ మరణించినపుడు కూడా తన తల్లి ఎలా సర్వైవ్ అయిందో తనకు తెలుసని ఇపుడు అలానే ఉంటానని ఏడుస్తూ చెప్తాడు.
మరోపక్క లోబో తన పిల్లలను మిస్ అవుతున్నానని ఈసారికి లెటర్ తనకి ఇవ్వాలని ప్రియాంకని కోరడం.. సిరి హనుమంత్ కూడా లెటర్ ని తీసుకోకుండా తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చూడవచ్చు. మరోపక్క రవి, మానస్, శ్రీరామచంద్రలు కూడ తమ లెటర్స్ ని తీసుకోవాలో వద్దా అని ఎమోషనల్ అవడం ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో చూడనున్నాము.
మొత్తానికి ప్రతివారం నామినేషన్ లో ఒకరిపై ఒకరు నామినేట్ చేసుకుంటూ తమ ఆవేశాన్ని, కోపాన్ని బయటపెట్టే ఇంటి సభ్యులు ఈవారం మాత్రం తమ కుటుంబ సభ్యులు పంపిన లెటర్స్ ని తీసుకోవాలో వద్దొనని భావొద్వేగానికి గురి కావడం సోమవారం నామినేషన్స్ లో చూడబోతున్నాం.