Bigg Boss 5 Latest Promo: ప్రోమోలో ఉన్న ఫైర్ ఎపిసోడ్ లో ఉంటుందా..!?
Bigg Boss 5 Latest Promo: ప్రోమోలో ఉన్న ఫైర్ ఎపిసోడ్ లో ఉంటుందా..!?
Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)
Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 శనివారం వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులు ఈ వారంలో చేసిన తప్పులను చూపిస్తూ గట్టి క్లాస్ పీకినట్టుగా కనిపిస్తుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి, శ్వేతవర్మ, లోబోలు బిగ్ బాస్ ఇంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు రవి టీంపై ఫైర్ అవుతాడు. నాగార్జున అడిగిన ప్రశ్నకి లోబో రవి చెప్పాడనే అలా చేశానని చెప్పడంతో రవి గడ్డి తినమంటే తింటావా అంటూ కౌంటర్ ఇచ్చాడు నాగ్.
రవికి చెప్పే ఆ కాటన్ తీశామని ఇపుడు రవి తనకి తెలియదని అనడం సరైనది కాదని శ్వేతావర్మ వాదించడం.. ఆ విషయంలో నాగార్జున ఆమె చెప్పింది నిజమని నమ్మి రవికి నటరాజ్ మాస్టర్ పెట్టిన గుంటనక్క పేరు సరైనదేనంటూ కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత శ్రీరామచంద్ర నటుల గురించి అలా ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని, అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ నాగార్జున గట్టిగానే చెప్పినట్లు ప్రోమోలో చూస్తే అర్ధమవుతుంది.
అయితే ప్రతిసారి ప్రోమోలో మాత్రమే ఫైర్ అయ్యే నాగార్జున ఎపిసోడ్ మాత్రం చివరికి తూతూ మంత్రంగానే చప్పగా ముగిస్తాడని బుల్లితెర అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇక నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు సేవ్ అవుతారో ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సిందే..