Biggboss : రీతూ-ఆయేషా గొడవ, మాధురి తగ్గేదేలే.. రమ్య కోరికలు తీర్చాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్మాల్సిందే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్‌లో టెన్షన్ రెట్టింపు అయింది.
Biggboss : రీతూ-ఆయేషా గొడవ, మాధురి తగ్గేదేలే.. రమ్య కోరికలు తీర్చాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్మాల్సిందే
Biggboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్‌లో టెన్షన్ రెట్టింపు అయింది. ముఖ్యంగా 38వ రోజు ఎపిసోడ్ ఫుల్ డ్రామా, గొడవలు, సరదా రొమాన్స్‌తో హీటెక్కింది. కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డు కంటెస్టెంట్స్ తమ ప్రతాపం చూపించడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారు. రేషన్ విషయంలో దివ్య, మాధురి మధ్య ఘర్షణ మొదలుకొని, కిచెన్ క్లీనింగ్ విషయంలో రీతూ, ఆయేషా మధ్య జరిగిన పెద్ద గొడవ వరకు, నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. అంతేకాకుండా కెప్టెన్ కళ్యాణ్ గుట్టు రట్టు కావడం, రమ్య మోక్ష సూపర్ ఫుడ్ లిస్ట్ వంటి వివరాలు నిన్నటి ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి.
38వ రోజు ఎపిసోడ్‌లో గొడవలు మొదటి నుంచే మొదలయ్యాయి. ప్రస్తుతం రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న దివ్యకు, వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ మాధురికి మధ్య ఆహారం విషయంలో ఘర్షణ జరిగింది. తమకు చెప్పకుండా ఫుడ్ తీసుకున్నందుకు దివ్య, మాధురిని ప్రశ్నించింది. దీనిపై మాధురి కోపంగా "అందరికీ ఫుడ్ అవసరం. నేను కూడా అమ్మనే" అంటూ సమాధానం ఇచ్చింది. దీనికి దివ్య "ఇక్కడ అమ్మ అనేది ఎందుకు వచ్చింది? రేషన్ మేనేజర్‌కి చెప్పాలి కదా!" అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఆ తర్వాత మాధురి సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసి, తన మనసులోని కోపాన్ని సంజనాపై చూపించింది. అనంతరం మాధురి దివ్యను మరోసారి టార్గెట్ చేస్తూ, రూల్స్ పాటించనని, నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోవాలని చీప్‌గా మాట్లాడి హౌస్‌మేట్స్‌పై ఆంక్షలు విధించింది. రీతూ దీనికి ఒప్పుకోకపోవడంతో మాధురి, రీతూ మధ్య కూడా వాదన జరిగింది.
బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్‌లో భాగంగా రమ్య, సుమన్ శెట్టితో కలిసి ఫుడ్ రిక్వెస్ట్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. రమ్య కోరిన ఫుడ్ లిస్ట్ చూసి బిగ్ బాస్‌తో పాటు నెటిజన్లు కూడా షాక్‌కు గురయ్యారు. రమ్య కోరిన జాబితాలో ఎగ్ పెసరట్టు, ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, పిజ్జా, నెయ్యి, పచ్చి మామిడి కాయలు, బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్, చాక్లెట్స్, చికెన్, వెజ్, నాన్-వెజ్ పికిల్స్ ఉన్నాయి. రమ్య లిస్ట్ చూసి ఈ కోరికలు తీర్చాలంటే బిగ్ బాస్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫుడ్ కేవలం రమ్య, ఆమె సెలెక్ట్ చేసిన సుమన్ మాత్రమే షేర్ చేసుకోవాలి.
గార్డెన్ ఏరియాలో పవన్, అయేషా జీనత్ మధ్య జరిగిన సరదా రొమాన్స్ హౌస్‌లో హైలైట్‌గా నిలిచింది. పవన్, అయేషాను పైకెత్తుకుని డ్యాన్స్ చేయగా, ఇమ్మాన్యుయేల్ కొత్త వాళ్లు రాగానే రీతూని వదిలేశాడు! అంటూ సెటైర్లు వేశాడు. ఇమ్మాన్యుయేల్ మాటలతో హౌస్ అంతా నవ్వుల్లో మునిగిపోయినా, రీతూ మాత్రం ఈ రొమాన్స్‌ను తేలికగా తీసుకోలేకపోయింది. ఆమె నిజంగానే అలిగి పవన్‌కి దూరమైంది. దీంతో పవన్ ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. రోజు చివర్లో కిచెన్‌లో రీతూ-అయేషా మధ్య పాత్రల విషయం పెద్ద గొడవకు దారితీసింది.