Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో కొత్త ట్విస్ట్..సీక్రెట్ రూంకు సంజన.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో ప్రతి రోజు కొత్త ట్విస్ట్‌లు, ఊహించని సర్ప్రైజ్‌లు, అంచనాలకు మించిన టాస్క్‌లతో ఉత్కంఠను పెంచుతోంది.

Update: 2025-09-27 05:20 GMT

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో కొత్త ట్విస్ట్..సీక్రెట్ రూంకు సంజన.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో ప్రతి రోజు కొత్త ట్విస్ట్‌లు, ఊహించని సర్ప్రైజ్‌లు, అంచనాలకు మించిన టాస్క్‌లతో ఉత్కంఠను పెంచుతోంది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ, కెప్టెన్సీ మార్పు, షాకింగ్ మిడ్‌వీక్ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ జరిగింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్య నిఖిత హౌస్‌మేట్స్‌కు ర్యాంకులు ఇవ్వడంతో మొదలైన రచ్చ, మిడ్‌వీక్ ఎలిమినేషన్‌లో కన్నీళ్లతో ముగిసింది. అసలు 19వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత రాకతోనే ఇంట్లో రచ్చ మొదలైంది. బిగ్ బాస్ ఆదేశాల మేరకు, దివ్య కెప్టెన్సీ టాస్క్‌కు కంటెండర్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో దివ్య, ఇమ్మాన్యుయేల్, భరణి, తనుజ, సుమన్ శెట్టి ఉన్నారు. తప్పించుకుంటారా లేదా ఒప్పిస్తారా అనే కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించి కొత్త కెప్టెన్ అయ్యాడు.

ఇదిలా ఉండగా సంజన, శ్రీజలు దివ్య బట్టలను తీసి దాచడంతో ఇంట్లో పెద్ద గొడవ మొదలైంది. ఈ చిన్న పనులకు మాస్క్ మ్యాన్ ఆమెపై విరుచుకుపడ్డాడు. దీంతో రీతూ, మాస్క్ మ్యాన్ మధ్య గొడవ జరిగింది. అయితే, దివ్య కెప్టెన్‌ను, క్లీనింగ్ ఇన్‌ఛార్జ్‌ను పిలిచి, నేను ఆ చెత్తను శుభ్రం చేయను అని చెప్పింది. ఈ దొంగతనానికి పాల్పడిన హౌస్‌మేట్స్‌ను శిక్షించాలని దివ్య కెప్టెన్‌ను అడిగింది. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కూడా దీనికి కారణమైన వారందరినీ శిక్షిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత 5 టీమ్‌లు స్పిన్ అండ్ విన్ టాస్క్ ఆడగా, వారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను గెలుచుకున్నారు.

బిగ్ బాస్ 9 ఈ సీజన్‌లో పరిచయం చేసిన రెడ్ సీడ్ పవర్ సిస్టమ్ ద్వారా ఊహించని మిడ్‌వీక్ ఎలిమినేషన్ ప్రకటించారు. యాపిల్ టాస్క్ లో రెడ్ సీడ్ పొందిన కంటెస్టెంట్లను, బ్లూ, బ్లాక్ సీడ్ కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ అధికారాన్ని ఉపయోగించి భరణి, రాము, కళ్యాణ్, హరీష్, డీమాన్ పవన్ చర్చించుకుని సంజనను బయటకు పంపాలని నిర్ణయించారు.

హౌస్‌మేట్స్‌లో మెజారిటీ మంది ఆమె దొంగతనం చేస్తుంది, తనతో ఉన్నవారికే అనుకూలంగా మాట్లాడుతుంది అంటూ సంజన పేరు చెప్పారు. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, ప్రియ, తనుజ, సంచన, రీతూ తమ బ్యాగులు ప్యాక్ చేసి సంజనను ఇంటి నుంచి బయటకు పంపారు. అందరికీ వీడ్కోలు చెప్పి సంజన నిష్క్రమించింది. అయితే, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ అమ్మ అమ్మ అని పిలుస్తూ సంజన వెళ్లిపోవడం చూసి ఎమోషనల్ అయ్యాడు. కానీ, బిగ్ బాస్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సంజనను ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపి, ఆ ఉత్కంఠతో ఆ రోజు ఎపిసోడ్‌ను ముగించారు. ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని షాక్ మరియు గొప్ప ట్విస్ట్.

Tags:    

Similar News