Biggboss : మాస్క్ మ్యాన్ అవుట్.. 4 వారాలకు హరీష్ హరిత ఎంత సంపాదించాడంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో సెప్టెంబర్ 7న ప్రారంభమై, ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్‌లో మాస్క్ మ్యాన్ హరీష్ పై భారీ అంచనాలు ఉండేవి.
Biggboss : మాస్క్ మ్యాన్ అవుట్.. 4 వారాలకు హరీష్ హరిత ఎంత సంపాదించాడంటే?
Biggboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో సెప్టెంబర్ 7న ప్రారంభమై, ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్‌లో మాస్క్ మ్యాన్ హరీష్ పై భారీ అంచనాలు ఉండేవి. అగ్నిపరీక్ష షోలో ఆయన చూపిన పట్టుదల లాస్ట్ వరకు హౌసులో ఉంటాడని భావించారు. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో ఆయన ప్రయాణం ఆ అంచనాలకు తగ్గట్టుగా సాగలేదు. చివరకు నాలుగో వారంలో ఆయన హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హరీష్ మొదటి నుంచీ తనకు తానుగా ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ప్రతి చిన్న విషయానికి హౌస్‌మేట్స్‌తో గొడవ పడడం, ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఒక మూలన కూర్చోవడం వంటి అలవాట్లు ఆయనకు పెద్ద మైనస్‌లుగా మారాయి. ఇలా రోజులు తరబడి మిగతా కంటెస్టెంట్స్‌ను దూరం పెట్టే ఆయన మనస్తత్వం ప్రేక్షకులలో ఆయన పట్ల వ్యతిరేకతను పెంచింది. ఆయన ప్రవర్తన చూస్తుంటే, ఆయనకు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనే బలంగా అనుకుంటున్నట్లు అనిపించింది. అందుకే, బిగ్ బాస్ రియాలిటీ షో ఆయన మనస్తత్వానికి అస్సలు సరిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అగ్నిపరీక్ష షోలో పూర్తి అవకాశం దొరికినట్లుగా, బిగ్ బాస్‌లో హరీష్‌కు ఆశించిన స్థాయిలో టాస్క్‌లలో ఛాన్స్ దొరకలేదనే చెప్పాలి. అయితే, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన పట్టుదలను చూపించేవాడు. కానీ ఈ వారం, టాస్క్ మధ్యలో దెబ్బలు తగలడం వల్ల ఆయన డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మొత్తంగా, ఈ వారం స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా దొరకకపోవడం ఆయన ఎలిమినేషన్‌కు ఒక ప్రధాన కారణంగా నిలిచింది. హరీష్ హరిత బిగ్ బాస్ అగ్ని పరీక్ష లో మాస్క్ మ్యాన్‌గా అడుగుపెట్టి, తనను తాను మ్యాన్ ఆఫ్ హార్ట్ వంటి ట్యాగ్‌లతో పరిచయం చేసుకున్నారు. హౌస్‌లోకి కామనర్‌గా అడుగుపెట్టినప్పటికీ, అందరితో అనవసరంగా వాదనలకు దిగడం, టాస్క్‌లలో చురుకుగా పాల్గొనకపోవడం, ముఖ్యంగా హౌస్‌మేట్స్‌తో రూడ్‌గా వ్యవహరించడం వంటి కారణాలు ఆయన ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపాయని తెలుస్తోంది.
రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, హరీష్‌కు వారానికి దాదాపు రూ. 80,000 చొప్పున పారితోషికం లభించిందని అంచనా. నాలుగు వారాలు హౌస్‌లో కొనసాగినందుకు గానూ, ఆయన సుమారుగా రూ. 3.20లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నట్లు తెలుస్తోంది. సామాన్యుల కేటగిరీలో ఎక్కువ రోజులు ఉన్నందుకు ఇది పర్వాలేదనే చెప్పాలి.