Bigg Boss 9: శ్రేష్టి వర్మ ఎలిమినేషన్ షాక్.. మొదటి వారమే అవుట్ అవుతుందా?
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టగా.. ఓనర్స్, టెనెంట్స్‌గా విభజించి రెండు హౌస్‌ల కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు.
Bigg Boss 9: శ్రేష్టి వర్మ ఎలిమినేషన్ షాక్.. మొదటి వారమే అవుట్ అవుతుందా?
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టగా.. ఓనర్స్, టెనెంట్స్‌గా విభజించి రెండు హౌస్‌ల కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. మొదటి వారం నామినేషన్లలోనే తొమ్మిది మంది కంటెస్టెంట్లు లిస్ట్‌లో చేరడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
వైరల్ అవుతున్న ఓటింగ్ లిస్ట్
నామినేషన్ల వెంటనే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ పేరుతో ఉన్న ఒక అకౌంట్ నుండి ఓటింగ్ లిస్ట్ బయటపడింది. అందులో ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయో కూడా వెల్లడైంది. సంజనా గల్రానీ ఎలిమినేట్ అవుతారని అనుకున్న సమయంలో, అనూహ్యంగా శ్రేష్టి వర్మ పేరు లిస్ట్ చివరలో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మొదటి వారం ఓటింగ్ శాతం
తనూజ – 26%
సుమన్ శెట్టి – 20%
ఇమ్మానుయేల్ – 16%
డీమోన్ పవన్ – 10%
సంజన గల్రానీ – 9%
రాము రాథోడ్ – 7%
రీతూ చౌదరి – 5%
ఫ్లోరా సైనీ – 3%
శ్రేష్టి వర్మ – 3%
దీని ప్రకారం శ్రేష్టి వర్మ అతి తక్కువ ఓటింగ్‌తో చివరి స్థానంలో నిలిచింది. ఫ్లోరా సైనీ కూడా సమాన స్థాయిలో ఉండటంతో, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
శ్రేష్టి వర్మ ఎందుకు అవుట్ అవుతుంది?
బయట ప్రాచుర్యం ఉన్నప్పటికీ, హౌస్‌లో శ్రేష్టి పెద్దగా తన ప్రెజెన్స్ చూపించలేకపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఓట్లు వేయలేదని చెబుతున్నారు. నామినేషన్లలో సంజన గల్రానీపై అందరూ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ, ఓటింగ్ ఫలితాల్లో ఆమె ఐదవ స్థానంలో నిలిచింది. కానీ శ్రేష్టి మాత్రం అనూహ్యంగా లాస్ట్‌లో నిలిచింది.
అయితే, మొదటి వారం బోనస్‌గా ఎలిమినేషన్ లేకుండా మినహాయించే అవకాశం ఉంటే.. శ్రేష్టి వర్మ సేవ్ అయ్యే అవకాశమూ ఉందని అంటున్నారు. కానీ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. ఈ వారం అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా శ్రేష్టికే కనిపిస్తోంది.