Biggboss 9 : బిగ్ బాస్ 9లో హీటెక్కిన నామినేషన్స్..లత్కోర్ పనులు అంటూ హరీష్ ఫైర్

బిగ్ బాస్ 9 మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత ఆరోపణలు, తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

Update: 2025-09-23 06:15 GMT

Biggboss 9 : బిగ్ బాస్ 9లో హీటెక్కిన నామినేషన్స్..లత్కోర్ పనులు అంటూ హరీష్ ఫైర్

Biggboss 9 : బిగ్ బాస్ 9 మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత ఆరోపణలు, తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ మొదట కామనర్లకు నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఓనర్స్ (సెలబ్రెటీలు) నుంచి నలుగురిని, తమ గ్రూప్ (టెనెంట్స్) నుంచి ఒకరిని నామినేట్ చేయాలని షరతు పెట్టారు. దీనిపై టెనెంట్స్ అందరూ చర్చించుకొని సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా సైనిలను నామినేట్ చేశారు. ముఖ్యంగా ప్రియ, శ్రీజ ఇద్దరూ కలిసి రీతూను నామినేట్ చేయగా, కెప్టెన్ డీమాన్ పవన్, కళ్యాణ్ ఆమెను కాపాడటానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఆ తర్వాత టెనెంట్స్ తమ గ్రూప్ నుంచి ఒకరిని నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు అందరూ కలిసి హరీష్‌ను నామినేట్ చేశారు. ఈ నిర్ణయంపై హరీష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రియ ఫుడ్ మానిటర్ పేరుతో కంటెస్టెంట్లను కించపరుస్తున్నారని అది తనకు నచ్చలేదని హరీష్ ఆరోపించాడు. దీనికి ప్రియ బదులిస్తూ, హరీష్ భోజనం మానేయడం తనకు నచ్చలేదని చెప్పింది. హరీష్ ఈ వాదనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'నా చావు నేను చస్తుంటే సంబరాలు చేసుకోవాలా' అని తీవ్రంగా స్పందించాడు.

హరీష్, పవన్ మధ్య జరిగిన వాగ్వాదం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. నామినేషన్స్ గురించి పవన్ మాట్లాడేటప్పుడు, హరీష్ తన పాయింట్‌లను బలవంతంగా చెప్పడంతో పవన్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. హరీష్ పవన్‌ను ఓదారుస్తూ.. 'మన వరకూ వస్తే తెలుస్తుంది' అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ రీతూ చౌదరి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, చాక్లెట్లు ఇచ్చి రీతూని కాపాడే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తూ లత్కోర్ పనులు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హరీష్‌ని ప్రియ, శ్రీజ లత్కోర్ అన్న పదం తప్పు అని అడిగినప్పుడు, అది బూతు కాదని, పులిహోర పంచాయితీ లాంటిదేనని హరీష్ వాదించాడు. చివరికి హరీష్ తన ఫోటోనే నామినేట్ చేయాలని కోరాడు.

టెనెంట్స్ నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ ఓనర్లకు ఒక ప్రత్యేక అధికారం ఇచ్చారు. కామనర్ల నామినేషన్స్ లిస్ట్ నుంచి ఇద్దరిని తీసివేసి, కొత్తగా ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పారు. ఓనర్లు సంజన, సుమన్ శెట్టిల పేర్లను తీసేసి, ఆ స్థానంలో పవన్ కళ్యాణ్, ప్రియలను నామినేట్ చేశారు. ఆ తర్వాత శ్రీజ, రాము రాథోడ్ కూడా నామినేట్ అయ్యారు. చివరగా, కెప్టెన్ డీమాన్ పవన్కు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు, దాని ప్రకారం నామినేషన్స్‌లో ఉన్న ఒకరిని సేవ్ చేయవచ్చు. హరీష్ ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. రీతూని సేవ్ చేయడానికి భయపడి, శ్రీజను సేవ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంతో రీతూ చాలా బాధపడింది. చివరగా నామినేషన్స్ లిస్ట్‌లో ఉన్నవారు: పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా సైని, రాము రాథోడ్.

Tags:    

Similar News