బంఫర్ ఆఫర్ కొట్టిన రాహుల్ సిప్లిగంజ్ ..
బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ సినిమా అవకాశం వరించింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ తెరకెక్కుతున్న సినిమాలో వెండితెరకు పరిచయం కానున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ సినిమా అవకాశం వరించింది. అది టాలివుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ తెరకెక్కుతున్న సినిమాలో వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో మరాఠి చిత్రం నట సామ్రాట్‌ను తెలుగులో రంగ మార్తండగా రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ బిగ్ బాస్ తెలుగులో సీజన్3 లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ షోలో రాహుల్ విన్నర్ గా నిలిచారు. దీంతో రాహుల్ క్రేజ్ ఆమాంతం పెరిగింది. దీంతో ప్రతీ తెలుగు ప్రేక్షకుడికి రాహుల్ సుపరిచితుడైయ్యారు. దీంతో చలన చిత్ర పరిశ్రమ కూడా రాహుల్ ఇమేజ్ ను వాడుకొవాలని చూస్తున్నాయి.
దీంతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొత్త చిత్రంలో రాహుల్ కు బంపర్ ఆఫర్ వరించింది. మొదటి సారి సినిమాల్లో కూడా నటించనున్నారు. రాహుల్ స్వయంగా తన ట్విటర్ ద్వారా తెలిపారు. గొప్ప చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు కృష్ణవంశీకి ప్రేత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రయాణం మొదలు పెడుతున్న అందుకు మీ అందరి ఆశ్సీసులు కోరుకుంటున్నా అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కాగా ఇదే సినిమాతోనే రాహుల్ సిప్లిగంజ్ తోపాటు అలీ రెజా కూడా నటించనున్నారు.
I feel very honoured to be a part of this amazing movie with impeccable cast, A big thanks to @director_kv #krishnavamsi Garu I feel very lucky and super excited for the shoot.
— Rahul Sipligunj (@Rahulsipligunj) November 30, 2019
My debut as an actor, I need all your blessings chichas! 🙏🏻#rangamarthanda pic.twitter.com/KLAWHGGNJB