బిగ్ బాస్ లో సంచలనం.. అందర్నీ ఫూల్స్ చేసిన బిగ్ బాస్..

బిగ్ బాస్ ఎపిసోడ్ 63 లో సంచలన ఎలిమినేషన్ జరిగింది. రాహుల్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు.

Update: 2019-09-21 16:53 GMT

బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎలిమినేషన్ లో ముగ్గురు నామినేట్ అయి ఉన్న విషయం తెలిసిందే. హిమజ, మహేష్ విట్టా, రాహుల్ అందులో ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వేల్లిపోతారనే దానిపై చాల అంచనాలు ఉన్నాయి. అయితే, ఈవారం డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయని నాగార్జున చెప్పారు. హౌస్ మేట్స్ తో వారంలో జరిగిన అన్ని విషయాలపై చర్చిస్తూనే.. ఈ డబుల్ ఎలిమినేషన్ పై ఓ ప్రకటన్ చేశారు. తరువాత ఎలిమినేట అయ్యే వారిలో ఒకరు ఈరోజు బయటకు వెళ్లిపోతారని చెప్పారు. దానికోసం ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారు అంటూ హౌస్ మేట్స్ ని అడిగారు నాగ్. దానికి రవి, శివజ్యోతి తప్ప అందరూ హిమజ పేరు చెప్పారు. అయితే, రవి, శివజ్యోతి మాత్రం రాహుల్ పేరు చెప్పారు. తరువాత నాగార్జున ఎవరు బయటకు వెళ్ళిపోతారో ప్రకటించి ఆశ్చర్యపరిచారు. రాహుల్ పేరును నాగార్జున ప్రకటించిన వెంటనే హోస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. రాహుల్ ఎలిమినేట్ అవుతారని ఎవరూ అంచనా వేయలేదు. దీంతో అందరూ షాకింగ్ స్టేజి లోనే రాహుల్ కు వీడ్కోలు పలికారు. రాహుల్ బయటకు వెళ్ళడానికి కొద్ది సెకన్ల ముందు వరకూ సైలెంట్ గా ఉన్న పునర్నవి.. రాహుల్ వెళుతున్న సమయంలో గేటు వద్ద అంటే సైలెంట్ గా ఒక హాగ్ ఇచ్చి పంపించింది. 

ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి నాగార్జున ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఈ ఎలిమినేషన్ అంటా వట్టిదే. అని చెప్పిన నాగార్జున ఇది నా ఆట కాదు.. బిగ్ బాస్ ఆట అన్నారు. 

Tags:    

Similar News