Bigg Boss3 telugu Episode 62: ఇంత అన్యాయమా బిగ్ బాస్?

Update: 2019-09-21 02:07 GMT

అరవై రోజులకు పైగా కుటుంబ సభ్యులకు..ప్రపంచానికీ దూరంగా బతుకుతున్న వారికి సినిమా చూపించాడు బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనివిధంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ భావోద్వేగాలనే షో కి ఆధారంగా చేసుకుని ఎపిసోడ్ నడిపించాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోల్లో చూసినదే అయినా.. ఇంత దారుణమైన ఎమోషన్స్ ఉంటాయని సాధారణ ప్రేక్షకుడు ఏమాత్రం ఊహించి ఉండడు.

బిగ్ బాస్ హౌస్ 15 మంది తొ ప్రారంభమయి రెండు నెలలు తిరిగేసరికి పది మందితో కొనసాగుతోంది. వారం వారం ఇచ్చే టాస్క్ లలో భాగంగా ఎదో ఒకటి చేసే బిగ్ బాస్ ఈసారి హౌస్ మేట్స్ అందరి కుటుంబ సభ్య్లులను తీసుకు వచ్చారు. అయితే, వారిని బయటనే ఉంచి.. వారితో లక్ గేమ్ ఆడించాడు. దీని లెక్క ప్రకారం ఇద్దరికీ మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది.

పాపం ఆ ఇద్దరూ..

కొద్దిపాటి తేడా వస్తేనే కొళాయి తిప్పే శివజ్యోతి, పైకి ధైర్యంగా కనిపించే శ్రీముఖి ఇద్దరూ తమ కుటుంబ సభ్యులని నేరుగా కలిసే అవకాశం కోల్పోయారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి గుక్కపట్టి ఏడ్చింది. బిగ్ బాస్ ఒక్కసారి అవకాశం ఇవ్వవూ ప్లీజ్ అంటూ ఆమె రోదించిన తీరు అందరినీ బాధపెట్టింది. ఇక శివజ్యోతి తన అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చారు. మళ్లీ కలిసే అవకాశం ఎప్పటికో గానీ రాదు. కానీ, తనకు కలిసే అవకాశం దొరకలేదంటూ వాపోయింది. ఈ ఇద్దరి బాధను చూసిన వారు కూడా ఎమోషనల్ అయ్యారు.

ఆ ఇద్దరికే దక్కిన అవకాశం..

బిగ్ బాస్ హౌస్ లో పదిమందికీ సంబంధిన పది మంది కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ పది మందిలో బిగ్ బాస్హౌస్ మేట్స్ ను కలిసే అవకాశాన్ని ఇద్దరి మాత్రమే ఇచ్చాడు బిగ్ బాస్. మొదట పది మందిలో ఐదుగుర్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. వితిక, శివజ్యోతి, రవి, పునర్నవి, హిమజ కుటుంబ సభ్యులు తొలి రౌండ్‌లో క్వాలిఫై కాగా.. ఈ ఐదురురిలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. వితికా తరుపున అతని అన్నయ్యకు తొలి అవకాశం లభించగా.. రవి మావయ్యకు రెండో అవకాశం లభించింది.

ఇలా ఆడితే బావుంటుంది..

తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం దొరికిన వితిక, రవికృష్ణలు వారిని కన్ఫెషన్ రూమ్ లో కలుసుకున్నారు. వారితో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఆటతీరు పై బయట జరుగుతున్న విశ్లేషణలు.. వారు ఎలా ఆడితే బావుంటుంది అనే సలహాలు ఇచ్చారు కుటుంబసభ్యులు. వితిక, రవి లు వారి కుటుంబ సభ్యులను కలసిన ఆనందంలో ఎమోషన్ అయ్యారు.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా భావోద్వేగాలతొ నిండిపోయింది. ఒకరి తరువాత ఒకరుగా ఏడుస్తూ.. ప్రేక్షకులకు కూడా కన్నీరు తెప్పించారు. ఇలా బిగ్ బాస్ ఇద్దరికే అవకాశం ఇవ్వడం పై వీక్షకులూ కొంత భావోద్వేగానికి గురయ్యేలా ఎపిసోడ్ సాగింది.


Tags:    

Similar News