Bhairavam: జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ – ఎప్పుడంటే?
ప్రేక్షకులను ప్రతి వారం కొత్త సినిమాలతో అలరిస్తున్న జీ తెలుగు ఈసారి మరో పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రానుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ “భైరవం” ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.

ప్రసార తేదీ & సమయం:
జులై 27, ఆదివారం సాయంత్రం 6 గంటలకు – జీ తెలుగులో
కథ సారాంశం
తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలోని వారాహి అమ్మవారి గుడి ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ (జయసుధ) తన మనవడు గజపతి (మంచు మనోజ్), అతని స్నేహితులు వరద (నారా రోహిత్), శ్రీను (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) లను తన సొంత పిల్లల్లా పెంచుతుంది. ఇదే సమయంలో ఒక మంత్రి దేవాలయ భూమిపై కన్నేస్తాడు.
నాగరత్నమ్మ మరణం తర్వాత గజపతి, వరద కలిసి శ్రీనును ట్రస్టీగా గెలిపిస్తారు. అయితే,
ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి ఎందుకు చంపాడు?
పోలీసులకు అబద్ధం చెప్పి, వరద భార్య (దివ్య పిళ్ళై) ముందు చెడ్డవాడిగా నిలబడాల్సిన పరిస్థితి శ్రీనుకి ఎందుకు వచ్చింది?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో భైరవం తప్పక చూడాలి!