OTTలో ఉత్తమ స్పై యాక్షన్ థ్రిల్లర్లు: ఏ సినిమా, సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?

OTT లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌పై ఓసారి లుక్కేయండి. Special Ops 2 నుండి Mukhbir, Adrishyam వరకు.. ఉత్తమ వెబ్‌సిరీస్‌లు, సినిమాల జాబితా మీకోసం.

Update: 2025-07-16 06:17 GMT

Best Spy Action Thrillers on OTT: Which Movies and Series Are Streaming Where?

ఓటీటీ (OTT) ప్రేక్షకులకు స్పై థ్రిల్లర్లు అంటే చక్కటి ఉత్కంఠ, ఆసక్తికర మలుపులు, రహస్య ఛర్యలు అన్నట్టే. అందులోనూ ‘స్పెషల్ ఓపీఎస్‌’ (Special Ops) లాంటి వెబ్‌సిరీస్‌లకు విపరీతమైన ఆదరణ ఉంది. దీని రెండో సీజన్‌ (Special Ops 2) జూలై 18 నుంచి జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ సందర్భంగా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ స్పై యాక్షన్ వెబ్‌సిరీస్‌లు, సినిమాల వివరాలు మీకోసం:

Berlin - జీ5లో స్ట్రీమింగ్

1993లో ఢిల్లీలో జరిగిన గూఢచర్యం కేసు నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘బెర్లిన్‌’ (Berlin). చెవిటి, మూగ వాడైన అశోక్ కుమార్ చుట్టూ నడిచే ఈ కథలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అతడిని ఎలా విచారించాయి? అతను నిజంగా స్పైనా? అన్నదానిపై క్లారిటీ వస్తుంది.

  • నటీనటులు: ఇష్వాక్ సింగ్, అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్
  • ఓటీటీ: Zee5

Tanaav - సోనీలివ్‌లో స్ట్రీమింగ్

కశ్మీర్ ఉగ్రవాద నేపథ్యంతో రూపొందిన యాక్షన్ వెబ్‌సిరీస్ ‘తనావ్‌’ (Tanaav). Special Task Group (STG) మాజీ అధికారులా, ఉగ్రవాదుల మధ్య ఘర్షణలపై కథ సాగుతుంది.

నటీనటులు: మానవ్ విజ్‌, ఆర్బాజ్ ఖాన్‌, శశాంక్ అరోరా

  • సీజన్లు: 2
  • ఓటీటీ: SonyLiv

Mukhbir: The Story of a Spy - జీ5లో స్ట్రీమింగ్

1965 భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన స్పై డ్రామా వెబ్‌సిరీస్ ‘ముఖ్బీర్‌’ (Mukhbir). పాకిస్తాన్‌లో గూఢచర్యం చేస్తున్న భారతీయ ఏజెంట్ కథ.

  • నటీనటులు: ప్రకాశ్ రాజ్‌, జైన్ ఖాన్ దురానీ
  • ఓటీటీ: Zee5

Kathmandu Connection - సోనీలివ్‌లో స్ట్రీమింగ్

1993 ముంబయి బాంబు పేలుళ్లు, 1999 విమాన హైజాక్ నేపథ్యంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘కాఠ్‌మండూ కనెక్షన్‌’ (Kathmandu Connection). గాఢంగా నడిచే డిటెక్టివ్ డ్రామా.

  • నటీనటులు: అమిత్ సియాల్‌, అక్షా పార్థసాని
  • సీజన్లు: 2
  • ఓటీటీ: SonyLiv

Adrishyam: The Invisible Heroes - సోనీలివ్‌లో స్ట్రీమింగ్

భారత గూఢచర్య విభాగమైన బీఐఏకు చెందిన ఇద్దరు సీక్రెట్ ఏజెంట్ల కథ. ‘అదృశ్యం - ది ఇన్విజిబుల్‌ హీరోస్‌’ (Adrishyam) సీరీస్‌ను బలమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

  • నటీనటులు: ఐజాజ్ ఖాన్‌, దివ్యాంకా త్రిపాఠి
  • సీజన్లు: 2
  • ఓటీటీ: SonyLiv
Tags:    

Similar News