Bandla Ganesh: టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎంగారు కావాలా..? బండ్ల గణేష్ సంచలన ట్వీట్
Bandla Ganesh: తెలుగు సినిమా ప్రముఖులపై నిర్మాత బండ్ల గణేష్ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో సినీ పెద్దలను ఎద్దేవా చేశారు.
Bandla Ganesh: టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎంగారు కావాలా..? బండ్ల గణేష్ సంచలన ట్వీట్
Bandla Ganesh: తెలుగు సినిమా ప్రముఖులపై నిర్మాత బండ్ల గణేష్ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో సినీ పెద్దలను ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ పెద్దలకు, తెలియజేయడానికి సమయం లేని సినీ పెద్దలకు పెద్ద నమస్కారం అని ఎద్దేవా చేశారు. టికెట్ రేట్లు పెంచడానికి మాత్రమే సిఎం గారు కావలెను అని సెటైర్ వేశారు.
బండ్ల గణేష్ తన ట్వీట్‌లో.. "గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”. అని రాసుకొచ్చారు.