Balakrishna in Squid Game: బాలయ్య, అనసూయ స్క్విడ్ గేమ్‌లో అదరగొట్టారు..

దక్షిణ కొరియాలో రూపొందిన ప్రపంచ ప్రఖ్యాత వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ ఓటీటీ ప్రియులను ఉత్కంఠభరిత కథతో మంత్రముగ్ధులను చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ మూడు సీజన్లుగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, గ్లోబల్ లెవెల్‌లో రికార్డు వ్యూస్ సాధించింది.

Update: 2025-07-17 13:38 GMT

Balakrishna in Squid Game: బాలయ్య, అనసూయ స్క్విడ్ గేమ్‌లో అదరగొట్టారు.. 

దక్షిణ కొరియాలో రూపొందిన ప్రపంచ ప్రఖ్యాత వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ ఓటీటీ ప్రియులను ఉత్కంఠభరిత కథతో మంత్రముగ్ధులను చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ మూడు సీజన్లుగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, గ్లోబల్ లెవెల్‌లో రికార్డు వ్యూస్ సాధించింది. ఇప్పుడు, ఏఐ సాంకేతికతతో మన తెలుగు స్టార్స్ ఈ గేమ్‌లో పాల్గొంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలయ్య స్క్విడ్ గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తే...

అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ఈ గేమ్ ఆడితే రూల్స్ అన్నీ బ్రేక్ అవ్వాల్సిందే! ఏఐ సాయంతో తయారైన ఈ వీడియోలో బాలయ్య ఎంట్రీ అద్భుతంగా చూపించారు. ఆట మధ్యలోనే చికాకు వచ్చి, గేమ్‌ను వదిలేస్తాడు. అయితే, తనను చంపడానికి వచ్చిన వారిని బోయపాటి స్టైల్ యాక్షన్లో గాల్లోకి లేపి పడగొడతాడు. ఆ సీక్వెన్స్ చూడగానే “బాలయ్య అంటే తగ్గేదే లే” అని నెటిజన్లు ఫుల్ ఫ్యాన్స్ అయ్యారు.

అనసూయ విజేతగా, రాజీవ్ కనకాల బలి

అనసూయ భరద్వాజ్ స్క్విడ్ గేమ్ విజేతగా నిలిచినట్టు ఏఐ వీడియోలో చూపించారు. ఆమె క్లోజప్ రియాక్షన్స్, గేమ్‌లో చూపించిన యాక్టింగ్ రియల్ క్యారెక్టర్‌లా అనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు, రాజీవ్ కనకాలను బలిగా చూపించడం నెటిజన్లను నవ్విస్తోంది. “సినిమాల్లో చావే రోల్స్, ఇక్కడా అదే పరిస్థితి” అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఏఐ ఎడిట్ చేసిన స్క్విడ్ గేమ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. “సినిమాల్లోనైనా, వెబ్ సిరీస్‌ల్లోనైనా బాలయ్య యాక్షన్‌కి తగ్గేదే లే”, “అనసూయ సూపర్” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



Tags:    

Similar News