Akhanda Movie Pre Release Event: బాలకృష్ణ సేవలకు అభిమానుల ఆర్దిక సాయం
* సాధారణంగా హీరోలు తమ అభిమానులకు ఆర్దికసాయం అందించటం చూస్తుంటాం.
బాలకృష్ణ సేవలకు అభిమానుల ఆర్దిక సాయం
Akhanda Movie Pre Release Event: సాదారణంగా హీరోలు తమ అభిమానులకు ఆర్దికసాయం అందించటం చూస్తుంటాం. కానీ హీరో బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం ఆయన అభిమానులు భారీగా డొనేషన్ లు ఇవ్వటం విశేషం. తాజాగా మోస్ట్ అవేటడ్ మూవీ "అఖండ" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు, ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని బాలకృష్ణ గారికి అందజేసారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర గారు ఒక లక్ష రూపాయులు మొత్తం ఎనిమిది లక్షలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి డోనేషన్ గా అందించారు.ఓవర్సీస్ 500 థియేటర్స్ లో డిసెంబర్ 2న విడుదలవుతున్న అఖండ పై భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం రాబట్టుకోనుంది.