అడుగడుగో యాక్షన్ హీరో.. రూలర్ సాంగ్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను చిత్ర బృంధం విడుదల చేసింది. అడుగడుగో యాక్షన్ హీరో అరే దేఖో యారో.. అనే పాటను ఆదివారం విడుదల చేశారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నపాత్రల్లో నటించారు. ఈ నెల 20వ తేదీనా సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజీగా ఉన్నారు. రామజోగయ్య శాస్త్రి రాసినా ఈ గేయానికి చిరంతన్ భట్ సంగీతం అందించారు. సాయిచరణ్ పాటను ఆలపించారు.
ఇటీవలి రిలీజ్ అయినా టీజర్ వీక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసి ఈ లిరికల్ సాంగ్ అచ్చు బాలకృష్ణ మెనరిజం ఈ పాటలో తెలియజేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. బాలకృష్ణకు జైసింహా చిత్రంలో సూపర్ హిట్ అందించిన దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మతగా వ్యవహారిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.