Pushpa 2: పుష్ప2 షోలో స్ప్రే కలకలం.. పరుగులు తీసిన ఆడియన్స్..!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప2.

Update: 2024-12-06 06:08 GMT

Pushpa 2: పుష్ప2 షోలో స్ప్రే కలకలం.. పరుగులు తీసిన ఆడియన్స్..!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప2. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అంతేకాదు తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో పుష్ప2 మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ముంబాయిలోని గెలాక్సీ థియేటర్‌లో సెకండ్ షో ప్రదర్శితమవుతున్న వేళ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ప్రేక్షకులు సినిమాలో లీనమై ఉన్న సమయంలో ఒక్కసారిగా ఘాటైన స్ప్రే కొట్టాడు. దీంతో ఆడియన్స్ అంతా గందరగోళానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక బెదిరిపోయారు. థియేటర్‌లో నుంచి బయటకు పరుగులు తీశారు.

స్ప్రే వాసనకు కొందరు వాంతులు, దగ్గుతో ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. చివరకు స్ప్రే కొట్టిన వ్యక్తిని పట్టుకుని పోలీసుకు అప్పగించారు. అయితే అతను మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తనిఖీ చేసిన తర్వాత 20 నిమిషాలకు తిరిగి షోను ప్రదర్శించినట్టు సమాచారం.

Tags:    

Similar News