Vachinavaadu Gautam: అశ్విన్ బాబు బర్త్‌డే స్పెషల్.. వచ్చినవాడు గౌతమ్ అదిరిపోయే పోస్టర్ విడుదల!
Vachinavaadu Gautam: యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ విడుదలైన వెంటనే హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
Vachinavaadu Gautam: అశ్విన్ బాబు బర్త్‌డే స్పెషల్.. వచ్చినవాడు గౌతమ్ అదిరిపోయే పోస్టర్ విడుదల!
Vachinavaadu Gautam: యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ విడుదలైన వెంటనే హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి. గణపతి రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతోంది. ప్రవల్లిక యోగి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.
ఆగస్ట్ 1న హీరో అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆయనకి ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తూ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అశ్విన్ బాబు ఇన్టెన్స్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది.
ఇటీవలే భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. అధునాతన హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యాక్షన్ సన్నివేశాలను సినిమాటిక్ లెవెల్లో తెరకెక్కించారు.
నిర్మాత గణపతి రెడ్డి ఎలాంటి రాజీ లేకుండా, గ్రాండ్ ప్రొడక్షన్ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోదు అనే స్థాయిలో తయారవుతోంది.
ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, VTV గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ ఎం.ఎన్. బాల్ రెడ్డి విజువల్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. గౌర హరి సంగీతాన్ని అందించగా, ఎం.ఆర్. వర్మా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ‘వచ్చినవాడు గౌతమ్’ థ్రిల్లింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశాలున్నాయి.