Tollywood: విడుదలకు సిద్ధమైన 'అర్జున్‌ సన్‌ ఆఫ్‌ వైజయంతి'.. సెన్సార్‌ టాక్ ఎలా ఉందంటే..?

నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి కల్యాణ్‌ రామ్‌కు తల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2025-04-08 10:26 GMT

Tollywood: విడుదలకు సిద్ధమైన 'అర్జున్‌ సన్‌ ఆఫ్‌ వైజయంతి'.. సెన్సార్‌ టాక్ ఎలా ఉందంటే..?

నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి కల్యాణ్‌ రామ్‌కు తల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందకు చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కాగా, U/A సర్టిఫికెట్ లభించింది.

ఈ చిత్ర రన్ టైం 2 గంటలు 24 నిమిషాలుగా ఉండనుంది. ఇక యాక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ సన్నివేశాలు సమపాళ్లలో ఉండేలా చిత్రీకరించారు. ఫస్టాఫ్‌లో ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో ఉంటుందని, ఇక సెకాండ్‌ ఆఫ్‌లో తల్లీ కొడుకుల బంధాన్ని భావోద్వేగాలతో చూపించారని చిత్ర యూనిట్‌ చెబుతోంది. క్లైమాక్స్‌లో అద్భుతమైన ట్విస్ట్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ని అందించనుందని మేకర్స్‌ చెబుతున్నారు.

కల్యాణ్ రామ్ ఓ బాధ్యతగల కొడుకుగా పవర్‌ఫుల్‌గా నటించగా, విజయశాంతి తల్లిగా బలమైన పాత్రను పోషించారు. వారి మధ్య వచ్చే భావోద్వేగ దృశ్యాలు సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చాలా రోజుల తర్వాత విజయ శాంతి మళ్లీ ఒక పవర్‌ ఫుల్ రోల్‌లో కనిపిస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు నిర్మాణంలో, అశోక క్రియేషన్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా వీక్షించిన సెన్సార్‌ సభ్యులు ప్రశంసలు కురిపించారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, ముఖ్యంగా కల్యాణ్ రామ్, విజయశాంతి నటన సినిమాకు విశేషంగా ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే 18వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News