ఇదెక్కడి ప్రమోషన్స్ మామా.. రిలీజ్‌కు ముందే సినిమా చూపించేశారు
సినిమా ప్రమోషన్స్‌ను రోజుకో కొత్త పుంత తొక్కిస్తున్నారు మేకర్స్. రకరకాల మార్గాల్లో తమ సినిమాలకు పబ్లిసిటీ సంపాదించుకున్నారు.
ఇదెక్కడి ప్రమోషన్స్ మామా.. రిలీజ్‌కు ముందే సినిమా చూపించేశారు
సినిమా ప్రమోషన్స్‌ను రోజుకో కొత్త పుంత తొక్కిస్తున్నారు మేకర్స్. రకరకాల మార్గాల్లో తమ సినిమాలకు పబ్లిసిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మూవీని వెరైటీగా ప్రమోషన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలకు ముందే ప్రదర్శించారు. ఇంతకీ ఏంటా సినిమా.? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ బాయ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు జయ శంకర్. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయ శంకర్ ఇప్పుడు మరో డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'అరి' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను విడుదలకు ముందే ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.
భగద్గీతలోని సారాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం నటించింది. అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షో చూసిన వారు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే అరి చిత్రాన్ని విడుదలకు ముందే వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని చిత్ర యూనిట్ కల్పిస్తోంది.
మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతో నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విడుదలకు ముందే సినిమాను ప్రదర్శిస్తున్నామంటే తమ సినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నామో చెప్పొచ్చని చిత్ర యూనిట్ అంటోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా చూడాలనుకునేవారు వివరాలను అందించాలంటూ వాట్సాప్ నెంబర్‌ను దర్శకుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా సినిమా విడుదలకు ముందే తమదైన ప్రమోషన్స్‌తో సినిమాకు హైప్ పెంచేశారు హరి మూవీ యూనిట్. మరి సినిమా చిత్ర యూనిట్ నమ్మకాన్ని ఏ మేరకు నిజం చేస్తుంది.? వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా.? లేదా తెలియాలంటే విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.