Anushka Shetty: జాతిరత్నంతో అరుంధతి మధ్యలో రౌడీ బేబీ
Ms Shetty Mr Polishetty Movie: అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించబోతుండగా.. ఓ కీలక పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని టాక్.
Naveen Polisetti,Anushka Shetty,Vijay Devarakonda
Ms Shetty Mr Polishetty Movie: జాతిరత్నంతో అరుంధతి.. మళ్లీ వీరిద్దరికి తోడు మన రౌడీ బేబీ అర్జున్ రెడ్డి. పోలా.. అదిరిపోలా.. కాంబినేషన్. అనుష్క కనపడటమే పండగ అయితే.. ఆమెతో నవీన్ పోలిశెట్టి అల్లరి... మధ్యలో విజయ్ దేవరకొండ వార్నింగ్స్... అసలేంటీ కాంబో.. ఊహించడానికే కష్టంగా ఉంది. కాని జరగబోతుంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించబోతుండగా.. ఓ కీలక పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది ఎంత సేపు ఉంటుందో తెలియదు. నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ ఇద్దరూ జాన్ జిగరీ దోస్తులనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే విజయ్ దేవరకొండ ఒప్పుకుని ఉండొచ్చనే టాక్ వినపడుతోంది.
ఈ సినిమాను ప్రభాస్ ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్నారు. కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తన కన్నా 20 ఏళ్ళ పెద్దదైన స్త్రీతో ప్రేమలో పడతాడట. ఈ సినిమాకి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ ఒకటి సోషల్ మీడియలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేష్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో.. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం.