అందుకే సినిమా ప్రమోషన్స్ కి రావటం లేదు అంటున్న అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran: అందుకే సినిమా ప్రమోషన్స్ కి రావటం లేదు అంటున్న అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran: కార్తికేయ ప్రమోషన్స్ పై క్లారిటీ ఇచ్చిన అనుపమ
Anupama Parameswaran: కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా యువ హీరో నిఖిల్ "కార్తికేయ 2" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. 2014లో బ్లాక్ బస్టర్ అయినా "కార్తికేయ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ మాత్రం ప్రమోషన్లలో ఎక్కడ కనిపించకపోవడంతో బోలెడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ ఐదు గంటలకి ఉన్న సరే టైంకి వచ్చేస్తుంది కానీ ప్రమోషన్లు అంటే మాత్రమే అనుపమ నుంచి రెస్పాన్స్ ఉండదు అంటూ హీరో నిఖిల్ కూడా పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా క్లారిటీ ఇచ్చింది అనుపమ.
"నేను కార్తికేయ ప్రమోషన్స్ కి ఎందుకు రావటం లేదు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను రాత్రింబవళ్లు రెండు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను. డేట్లు కుదరకపోవడంతో కార్తికేయ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోతున్నాను. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా హీరో నిఖిల్ గారి ఎఫర్ట్స్ కి కూడా నా కృతజ్ఞతలు" అని చెప్పకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.