Anu Emmanuel: స్టార్ హీరో లతో సినిమాలు చేయనున్న అను

* అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్‌గా మారే అవకాశం ఉందని సమాచారం

Update: 2022-11-13 12:00 GMT

స్టార్ హీరో లతో సినిమాలు చేయనున్న అను ఎమ్మాన్యూయల్

Anu Emmanuel: కొందరు నటీనటులకు కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ డం వచ్చేస్తుంది. కానీ మరికొందరికి మాత్రం ఎన్నో సినిమాలు, కష్టాలు తర్వాతే సక్సెస్ వస్తుంది. అలాంటి వారిలో ఒకరు అను ఎమ్మాన్యూయల్. ఎందరో స్టార్ హీరో లతో సినిమాలు చేసిన అను ఎమ్మాన్యూయల్ అనుకున్న విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. కానీ తాజాగా విడుదలైన "ఊర్వశివో రాక్షసివో" సినిమా తో మంచి హిట్ అందుకుంది అను ఎమ్మాన్యూయల్. అయితే ఈ సినిమాతో కేవలం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే సంతృప్తి చెందారు. ఈ చిత్రం ఎబవ్ యావరేజ్ గా నిలిచింది కానీ అను ఎమ్మాన్యూయల్ మాత్రం తన నటన తో మంచి మార్కులే సంపాదించుకుంది.

సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి అను కు తెగ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే అను కార్తీ హీరోగా ఒక సినిమాకి సంతకం చేసింది. ఇక తాజాగా ఆమెకు మహేష్ బాబు మరియు ఎన్టీఆర్‌ల సినిమాల కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. #SSMB28లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్‌గా మారే అవకాశం ఉందని సమాచారం. ఇక #ఎన్టీఆర్30లో ప్రధాన హీరోయిన్ పాత్ర కోసం వేరే వారిని అనుకుంటున్నప్పటికీ అను ఇమ్మాన్యుయల్ ఈ చిత్రంలో కూడా ఒక కీలక పాత్ర ను పొందే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలతో అను ఎమ్మాన్యూయల్ ఎంతవరకు హిట్ లు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News