Toxic : యష్ టాక్సిక్ కోసం ఏకమైన రెండు శక్తులు. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా విడుదలకు ఇంకా కేవలం 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది.

Update: 2025-12-08 09:30 GMT

Toxic : యష్ టాక్సిక్ కోసం ఏకమైన రెండు శక్తులు. ఇక బొమ్మ బ్లాక్ బస్టరే

Toxic : రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా విడుదలకు ఇంకా కేవలం 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం, సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం సినీ పరిశ్రమలోని రెండు పెద్ద శక్తులు ఏకమవుతున్నట్లు సమాచారం. ఈ వార్త యష్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

టాక్సిక్ సినిమా మ్యూజిక్ గురించి మొదటి నుంచీ చాలా ఉత్సుకత ఉంది. మొదట సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించినా, తర్వాత రవి బస్రూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. ఈ ఇద్దరు దిగ్గజాలు సినిమా మ్యూజిక్ విభాగంలో కలిసి పని చేయనున్నారట. అందుతున్న సమాచారం మేరకు రవి బస్రూర్ టాక్సిక్ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సినిమాలోని పాటలకు సంగీత దర్శకత్వం వహించనున్నారట.

రవి బస్రూర్ కన్నడ సినీ పరిశ్రమలో ప్రసిద్ధ సంగీత దర్శకుడు. ఇతర భాషల్లోనూ ఆయనకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యష్ సినిమాలకు పనిచేయడం, వారి మధ్య మంచి వర్క్ సపోర్ట్ ఉండటం ప్లస్ పాయింట్. అనిరుధ్ తనదైన శైలిలో సంగీతంతో ప్రేక్షకుల ఆదరణ పొందారు. అనేక బిగ్ బడ్జెట్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఈ ఇద్దరూ కలిసి పని చేయడం వలన మ్యూజిక్ అవుట్‌పుట్ అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది.

టాక్సిక్ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌తో పాటు కియారా అడ్వాణీ, నయనతార వంటి ప్రముఖ నటీమణులు నటించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పని చేయడం విశేషం.

Tags:    

Similar News