'బాబోయ్.. పైత్యం'.. అనసూయ 'The' ట్వీట్ విజయ్ దేవరకొండని ఉద్దేశించేనా..?
Anchor Anasuya: యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితురాలే..ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెరపై ఈ రెండింటితో పాటు వెబ్ సిరీస్ లోనూ దూసుకెళుతోంది.
అనసూయ VS విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో సెగలు పొగలు..
Anchor Anasuya: యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితురాలే..ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెరపై ఈ రెండింటితో పాటు వెబ్ సిరీస్ లోనూ దూసుకెళుతోంది. ఇదిలాఉంటే తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా రచ్చ చేయడం అనసూయకు అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే హీరో విజయదేవరకొండ పై మరోసారి కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసింది.
విజయదేవరకొండ-అనసూయ మధ్య వివాదం ఈనాటిది కాదు. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అప్పటి ప్రమోషన్స్ లో ఉన్న పదంపై అనసూయ అప్పట్లో బహిరంగ విమర్శలు చేసింది. దీనికి కౌంటర్ గా విజయదేవరకొండ కూడా రియాక్ట్ కావడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ అయింది. ఆ తర్వాత లైగర్ డిజాస్టర్ కావడంతో బాగా జరిగిందంటూ అనసూయ కామెంట్లు చేసింది. ఇక తాజాగా ఖుషి సినిమా పోస్టర్ పై కామెంట్స్ చేసి అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా దర్శకుడు శివ నిర్వాణ ఖుషి సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా సినిమాలోని మొదటి సాంగ్ ను మే 9న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయదేవరకొండ పేరు ముందు ది అని ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనసూయ ట్వీట్ చేసింది. దీ నా బాబోయ్ పైత్యం, ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అనసూయ చేసిన ట్వీట్ లో విజయదేవరకొండ పేరును ప్రస్తావించకుండా ది అనే పదాన్ని ప్రస్తావించడంతో అతడి గురించే మాట్లాడిందని అందరూ భావిస్తున్నారు.
అనసూయ చేసిన పోస్ట్ కు రియాక్ట్ అవుతూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంటీ అనే హ్యష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి అనసూయ కూడా ఘాటుగా స్పందించింది. తన ట్విట్టర్ ఖాతాలో భలే రియాక్ట్ అవుతున్నారా దొంగ ఊప్స్..బంగారు కొండలంట...ఎక్కడో అక్కడ నేను నిజం అనేది నిరూపిస్తున్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి కౌంటర్ గా ఆంటీ కొంచెం ఆగు అంటూ వరుస కామెంట్స్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నారు. మరి, శృతిమించి పాకాన పడుతున్న అనసూయ, విజయదేవరకొండ ఫ్యాన్స్ రైవల్రీ ఎక్కడకు దారి తీస్తుందో మరి.