MAA Elections: "నిన్న గెలుపు ఇవాళ ఓటమి అంటున్నారు ఏంటి" అని అడుగుతున్నా అనసూయ

MAA Elections: "నిన్న గెలుపు ఇవాళ ఓటమి అంటున్నారు ఏంటి" అని అడుగుతున్నా అనసూయ

Update: 2021-10-12 11:30 GMT

అనసూయ (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ కూడా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి ఈసీ మెంబర్ గా బరిలో దిగి భారీ మెజారిటీతో గెలిచినట్టు నిన్న వార్తలు వచ్చాయి. కానీ ఇవాళ 'మా' ఎన్నికల అధికారి విడుదల చేసిన జాబితాలో అనసూయ పేరు లేకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈసీ మెంబర్లుగా 18 మంది ఎన్నిక అవ్వగా అందులో మంచు విష్ణు ప్యానెల్ కు సంబందించి 10 మంది ఉన్నారు మరియు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు 8 మంది ఉన్నారు.

దీనిపై అనసూయ స్పందిస్తూ, రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందని ఫన్నీ గా నిలదీసింది. ''600 ఓట్లని లెక్కించడానికి రెండు రోజులు ఎందుకు అని అడిగారు. రాత్రికి రాత్రి ఏం జరిగింది? నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు'' అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. "క్షమించాలి ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వు వచ్చేస్తుంది. మీతో పంచుకుంటున్నాను ఏమనుకోవద్దు. నిన్న "అత్యధిక మెజారిటీ", "భారీ మెజారిటీ" తో గెలుపు అని ఈరోజు "లాస్ట్", "ఓటమి" అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుంది అబ్బా. అసలు ఉన్న సుమారు 900 ఓటర్లలో ఆరు వందల ఓట్ల లెక్కింపు కి రెండో రోజుకి వాయిదా వేయాల్సిన అంత టైం ఎందుకు పట్టింది అంటారు? ఆహా లేదు అర్థం కాక అడుగుతున్నను" అని చమత్కారంగా నిలదీసింది అనసూయ.

Tags:    

Similar News