మళ్ళీ అఖిల్ కి అమ్మగా ఆమని

అక్కినేని మూడో తరం వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.

Update: 2019-12-05 05:07 GMT
అఖిల్, ఆమని

అక్కినేని మూడో తరం వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.. ఇప్పటికి చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ల గా ప్రూవ్ చేసుకున్న దర్శకులతో పని చేసుకున్నప్పటికీ అఖిల్ కి మాత్రం కలిసి రావడం లేదు. ఈ తరుణంలో కరుణాకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇటు అఖిల్ కి, అటు కరుణాకర్ కి సరైనా హిట్లు లేకపోవడం, ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సినిమాని చేస్తుండడంతో సినిమాపైన ఆసక్తి పెరిగింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అఖిల్ కి అమ్మగా నటి ఆమని నటిస్తోంది. తాజాగా జరుగుతున్న షూటింగ్ లో కూడా ఆమని పాల్గొంటుంది. పాతికేళ్ల కింద అఖిల్ కి సిసింద్రి అనే సినిమాలో అమ్మగా నటించింది ఆమని.. ఇప్పుడు మళ్ళీ అఖిల్ కి అమ్మగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషపడుతుంది ఆమని. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  



Tags:    

Similar News